'నక్షత్రం' పాటల హంగామా

Tuesday,February 28,2017 - 10:50 by Z_CLU

 

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీచక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై  ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్” పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”. ఈ సినిమా టాకీపార్ట్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం బ్యాంకాక్ లో పాటలు షూట్ చేస్తున్నారు. సందీప్ కిషన్,రెజీనా పై ఒక పాట, సాయిధరమ్ తేజ్, ప్రగ్య జైస్వాల్ ల పై ఒక పాట చిత్రీకరిస్తారు. అలాగే ఒక ప్రత్యేక గీతాన్ని కూడా బ్యాంకాక్ లోనే షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఏప్రిల్ లో నక్షత్రం సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.

‘పోలీస్ ‘అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ ‘నక్షత్రం’. రామాయణంలో హనుమంతుని పాత్ర  ఎంతటి ప్రాధాన్యత ను కలిగి ఉంటుందో..  సమాజం లో ‘పోలీస్’ పాత్ర అలాంటిది. అలాంటి పాత్రను ఈ ‘నక్షత్రం’ లో ఎలా చూపించబోతున్నామన్నది వెండితెరపైనే చూడాలన్నారు దర్శకుడు కృష్ణ వంశీ.

సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్య జైస్వాల్, తులసి, జె.డి.చక్రవర్తి, ప్రకాష్ రాజ్, శివాజీరాజా, రఘుబాబు, తనీష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.