ఒకటి కాదు.. రెండు నక్షత్రాలు

Thursday,August 03,2017 - 04:09 by Z_CLU

నక్షత్రం సినిమా రేపు గ్రాండ్ గా విడుదలకానుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. కానీ ఇదొక మల్టీస్టారర్ మూవీ. అవును.. సందీప్ కిషన్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా ఇందులో ఉన్నాడు. పేరుకు తేజూది కీలక పాత్రే అయినప్పటికీ… ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉంటుందట. అందుకే నక్షత్రంలో సందీప్, సాయిధరమ్ ఇద్దరూ హీరోలే.

పోలీస్ అవ్వాలనుకునే కుర్రాడిగా సందీప్ నటిస్తే.. అలెగ్జాండర్ అనే పవర్ ఫుల్ పోలీస్ గా సాయిధరమ్ కనిపించనున్నాడు. సినిమాలో ఈ రెండు పాత్రలూ కీలకమే. అందుకే నక్షత్రం ఓ మల్టీస్టారర్ మూవీగా నిలిచింది. మరో హీరో తనీష్ ఇందులో నెగెటివ్ షేడ్స్ లో కనిపించనుండడం విశేషం.

సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. రెజీనా, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.