నక్షత్రం కౌంట్ డౌన్ బిగిన్ అయింది

Thursday,August 03,2017 - 12:31 by Z_CLU

కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘నక్షత్రం’ మూవీ కౌంట్ డౌన్ బిగిన్ అయింది. రేపు గ్రాండ్ రిలీజ్ కి రెడీగా ఉంది నక్షత్రం. ఇప్పటికే కలర్ ఫుల్ పోస్టర్స్ తో, ట్రేలర్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్న నక్షత్రం సినిమా యూనిట్, సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ కాన్ఫిడెంట్ గా ఉంది.

సాయి ధరం తేజ్ ఈ సినిమాలో అలెగ్జాండర్ అనే వెరీ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. హీరో సందీప్ కిషన్ కరియర్ లోనే మోస్ట్ పర్ఫామెన్స్ బేస్డ్ క్యారెక్టర్ లో నటించాడని ట్రేలర్స్ చూస్తే తెలిసిపోతుంది. దానికి తోడు రెజీనా, ప్రగ్యా గ్లామర్ సినిమా అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్తున్నాయి. ఈ సినిమాలో శ్రియ స్పెషల్ సాంగ్ చేయడం సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎసెట్.

ఇండియన్ పోలీస్ స్టామినా ఎలివేట్ అయ్యేలా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి భీమ్స్, భరత్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.