నక్షత్రం సెన్సార్ పూర్తి.. రెడీ ఫర్ రిలీజ్

Saturday,July 22,2017 - 11:29 by Z_CLU

కృష్ణవంశీ డైరక్ట్ చేసిన నక్షత్రం సినిమా రిలీజ్ కు ముస్తాబైంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సెన్సార్ అధికారులు ఈ సినిమాకు  U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ కంప్లీట్ అవ్వడంతో రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్ట్ 4న థియేటర్లలోకి వస్తున్నామని ప్రకటించారు.

ఓ సామాన్య యువకుడు పోలీస్ అవ్వడం కోసం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎలాంటి పరిస్థితుల మధ్య పోలీస్ అయ్యాడనేది సినిమా స్టోరీ. సందీప్ కిషన్ ఇందులో హీరోగా నటించగా, మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఓ కీలకమైన పాత్ర పోషించారు. మరో హీరో తనీష్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది మల్టీస్టారర్ మూవీ కింద లెక్క.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన నక్షత్రం సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, రెజీనా హీరోయిన్లుగా నటించారు. శ్రియ ఓ ఐటెంసాంగ్ చేసింది. ప్రకాష్ రాజ్, జేడీ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.