నాగ్ ఫినిషింగ్ టచ్

Tuesday,November 08,2016 - 12:31 by Z_CLU

అక్కినేని నాగార్జున దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవలే ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ మరో షెడ్యూల్ కి రెడీ అవుతుంది.

anushka

నాగార్జున వెంకటేశ్వర స్వామి భక్తుడి గా ‘హాథిరామ్ బాబా’ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. నవంబర్ 15 నుండి 25 వరకూ జరిగే షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ కంప్లీట్ అవుతుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే విజువల్ ఎఫెక్ట్స్ పనులు ప్రారంభించనున్నారు యూనిట్. విమలారామన్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క ఓ కీలక పాత్రలో కనిపించనుంది.