క్రిష్ దర్శకత్వంలో నాగశౌర్య

Tuesday,July 16,2019 - 12:41 by Z_CLU

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు క్రిష్, మరోసారి మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. నాగశౌర్యను డైరక్ట్ చేయబోతున్నాడు. అయితే ఈ కాంబినేషన్ లో చాలా మెలికలున్నాయి.

ముగ్గురు దర్శకుల్ని పెట్టి ఓ ప్రయోగాత్మక సినిమా చేయబోతున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఒకే సినిమాలో 3 ప్రేమకథల్ని చూపించబోతున్నారు. నాగశౌర్యను హీరోగా సెలక్ట్ చేశారు. ముగ్గురు ముద్దుగుమ్మల్ని సెలక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

ఇందులో ఒక లవ్ స్టోరీని హ్యాండిల్ చేసే బాధ్యతను క్రిష్ కు అప్పగించారు రాఘవేంద్రరావు. సినిమాకు సంబంధించి మరో ఇద్దరు దర్శకుల్ని కూడా ఎంపిక చేయాల్సి ఉంది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారన్నమాట. ఈ సినిమాకు గోపీమోహన్, బీవీఎస్ రవి స్క్రిప్ట్ అందిస్తున్నారు.

ప్రస్తుతం నాగశౌర్య 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ రాఘవేంద్రరావు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.