నాగశౌర్య కొత్త స్ట్రాటజీ

Wednesday,August 29,2018 - 04:14 by Z_CLU

రేపు రిలీజవుతున్న @నర్తనశాల సినిమా విషయంలో సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నాడు నాగశౌర్య. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ని ప్రిఫర్ చేస్తూనే, సినిమాలో ఫ్రెష్ కంటెంట్ ఉండేలా కేర్ తీసుకుంటున్న నాగశౌర్య, ఈ సినిమాతో శ్రీనివాస చక్రవర్తి అనే కొత్త డైరెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తరవాత సొంత బ్యానర్ లో మరో సినిమా చేయనున్న ఈ హీరో, ఈసారి కూడా మరో కొత్త డైరెక్టర్ నే ప్రిఫర్ చేస్తున్నాడు.

నాగశౌర్య సొంత బ్యానర్ ‘ఐరా క్రియేషన్స్’ లో మరో సినిమా త్వరలో సెట్స్ పైకి రానుందని కన్ఫమ్ చేసిన నాగశౌర్య, ఈ సినిమాతో రమణ తేజ అనే మరో డైరెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఫలానా డైరెక్టర్ తో సినిమా చేయాలనే టార్గెట్స్ ఏ మాత్రం పెట్టుకోకుండా, కూల్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ హీరో గ్రాఫ్ చూస్తుంటే కొత్త డైరెక్టర్స్ ని ఏరికోరి ఎంకరేజ్ చేస్తున్నాడా..? అనిపిస్తుంది.

ఓ వైపు @నర్తనశాల సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే రాజా కొలుసు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్న నాగశౌర్య, స్క్రిప్ట్ బావుండాలే కానీ, ఏ డైరెక్టర్ తో పనిచేయడానికైనా రెడీ అంటున్నాడు.