నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం

Monday,October 14,2019 - 06:43 by Z_CLU

కరియర్ లోనే ఫస్ట్ టైమ్ స్పోర్ట్స్ బేస్డ్ ఎంటర్టైనర్ లో నటించబోతున్నాడు నాగశౌర్య. ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్  సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది.

హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. కథ చాలా ఎగ్జైటింగ్ ఉందని, దర్శకుడు సంతోష్ ఓ ఇమాజినరీ బయోపిక్ లా ఈ సినిమాని ప్లాన్ చేసుకున్నాడని చెప్పుకున్నాడు నాగశౌర్య.

ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ L.L.P., నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై నారాయణ దాస్ నారంగ్, శరత్ మరార్, రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించనున్నారు.