స్పీడ్ పెంచిన నాగ శౌర్య

Saturday,June 23,2018 - 05:46 by Z_CLU

‘ఛలో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ శౌర్య స్పీడ్ పెంచేసాడు. ప్రెజెంట్ తన బ్యానర్ లో ‘నర్తన శాల’ సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరో లేటెస్ట్ గా మరో సినిమాను స్టార్ట్ చేసాడు. ఈరోజు ఉదయం కూకట్ పల్లి లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో  పూజా కార్యక్రమాలతో నాగ శౌర్య కొత్త సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో రాజా కొలుసు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్న ఈ సినిమా ఆగస్ట్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.