సొంత కథ రాసుకున్న నాగశౌర్య

Saturday,May 11,2019 - 01:11 by Z_CLU

నాగశౌర్య కొత్త సినిమా లాంచ్ అయింది. రీసెంట్ గా ‘గే’ కామెడీ తో ‘నర్తనశాల’ లో డిఫెరెంట్ గా ఎంటర్ టైన్ చేసిన ఈ హీరో ఈసారి మరింత కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే ఈ సారి సినిమాకి తనే స్వయంగా కథ రాసుకున్నాడు.

ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుంది టీమ్. ఈ నెల 13 నుండి వైజాగ్ లో ఫస్ట్ షెడ్యూల్ బిగిన్ కానుంది. ఈ సినిమాతో రమణ తేజ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు.

ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ సినిమాలో నాగశౌర్య సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఉషా ముల్పూరి ప్రొడ్యూసర్.