నాగశౌర్య ‘నర్తనశాల’ లో హీరోయిన్ ఫిక్సయింది..?

Saturday,April 14,2018 - 05:45 by Z_CLU

‘ఛలో’ లాంటి సూపర్ హిట్ ఎంటర్ టైనర్ తరవాత మళ్ళీ తన సొంత ఐరా క్రియేషన్స్ పై మరో సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. ఆల్ రెడీ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో రీసెంట్ గా మొదలైనా, ఈ సినిమా హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ స్టేటసే ఉంది. అయితే ఇప్పుడీ స్పేస్ లో ‘హలో’ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పేరు కాస్త గట్టిగానే వినిపిస్తుంది.

మొదట్లో ఈ సినిమాలో నాగశౌర్య ప్లేస్ లో మెహరీన్ హీరోయిన్ గా ఫిక్సయిందనే టాక్ వినిపించినా, అది జస్ట్ రూమరే అని తేలిపోయింది. ఇప్పుడు అదే ప్లేస్ లో కిర్రాక్ పార్టీ ఫేమ్ సిమ్రాన్ పరీన్జా పేరు వినిపించినా అది కూడా అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ కాలేదు.

మరి ఈ వరసలో తాజాగా చేరిన కళ్యాణి ప్రియదర్శన్ కూడా జస్ట్ రూమర్ గా సైడై పోతుందా..? లేక హీరోయిన్ గా ఫిక్సవుతుందా అనేది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. సాగర్ మహతి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా శ్రీనివాస్ చక్రవర్తి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.