నాగశౌర్య ‘నర్తనశాల’ సినిమాపై క్లారిటీ

Friday,July 20,2018 - 07:54 by Z_CLU

ఈ రోజు నాగశౌర్య నర్తనశాల సినిమా ఫ్రెష్ లుక్ రిలీజయింది. హైదరాబాద్ లోని  మాల్ లో నాగశౌర్య ఫ్యాన్స్ మధ్య ఈ ఫ్రెష్ లుక్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్.  ఈ ఈవెంట్ లో దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అని క్లారిటీ ఇచ్చాడు.

టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే ఫ్యాన్స్ లో ఈ సినిమా చుట్టూ క్యూరాసిటీ క్రియేట్ అయింది. దానికి తోడు ‘ఛలో’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత  నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్  పై నిర్మిస్తున్న సినిమా కావడంతో  ఈ సినిమా చుట్టూ భారీ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఫ్రెష్ లుక్ తో సినిమా ప్రమోషన్స్ బిగిన్ చేసిన యూనిట్ త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

కష్మిరా పరదేశి, యామినీ భాస్కర్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా శ్రీనివాస చక్రవర్తి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. ఉషా ముల్పూరి ఈ సినిమా ప్రొడ్యూసర్.