@నర్తనశాల టీజర్ – నాగశౌర్య షాక్ ఇచ్చాడు

Tuesday,August 07,2018 - 05:02 by Z_CLU

నాగశౌర్య @నర్తనశాల టీజర్ రిలీజయింది. రీసెంట్  గా  ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేసిన ఫిల్మ్ మేకర్స్, ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ 1: 13 సెకన్ల  టీజర్ తో అసలీ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టారో క్లారిటీ ఇచ్చేశారు.

టీజర్ లో సినిమా స్టోరీ కన్నా ఎక్కువగా నాగశౌర్య క్యారెక్టర్ నే ఎక్కువగా రివీల్ చేశారు ఫిల్మ్ మేకర్స్. ఓ వైపు లవర్ బాయ్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఎలివేట్ చేస్తూనే, నాగశౌర్య ఈ సినిమాలో ‘గే’ గా కనిపిస్తాడని ఎస్టాబ్లిష్ చేసి, ఫ్యాన్స్  లో క్యూరియాసిటీ రేజ్ చేశారు.  మరి ఈ టీజర్ లో చూపించినట్టు సినిమాలో నాగశౌర్య నిజంగానే ‘గే’ నా..? కాదా..? లాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరకాలంటే సినిమా రిలీజ్ అయితే కానీ క్లారిటీ రాదు.

నాగశౌర్య సరసన కాశ్మీరా, యామినీ భాస్కర్  హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా శ్రీనివాస్ చక్రవర్తి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. ఉషా ముల్పూరి ఈ సినిమాని ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.