నాగశౌర్య ‘అశ్వత్థామ’ రిలీజ్ డేట్

Wednesday,December 11,2019 - 12:34 by Z_CLU

నాగశౌర్య ‘అశ్వథ్థామ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 31 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా కథని నాగశౌర్య సొంతంగా రాసుకున్న విషయం తెలిసిందే.

నాగశౌర్య ఈ సినిమాలో కంప్లీట్ గా మాస్ హీరోలా కనిపించబోతున్నాడు. మెహరీన్ కౌర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న మేకర్స్, త్వరలో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

 

రమణ తేజ ఈ సినిమాకి డైరెక్టర్. ఉషా ముల్పూరి నిర్మిస్తున్న అశ్వ థ్థామ ఐరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు.