నాగశౌర్య 'అమ్మమ్మగారిల్లు' ట్రైలర్ రివ్యూ

Thursday,May 24,2018 - 03:22 by Z_CLU

రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది నాగశౌర్య ‘అమ్మమ్మగారిల్లు’. సుందర్ సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా చుట్టూ ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్. 2 నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ లో సినిమాలోని ఇమోషనల్ ఆంగిల్ అవుతుంది.

ట్రైలర్ ని బట్టి చాలా రోజుల తరవాత ఒకేచోటికి చేరిన ఫ్యామిలీ, వారి మధ్య ఇమోషన్స్ సినిమాలో హైలెట్ పాయింట్ అని తెలుస్తుంది. దానికి తోడు ‘జీవితంలో కలిసి రావాలంటే కూతురిని కనాలి, తెలిసి రావాలంటే కొడుకుని కనాలి’ అనే డైలాగ్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తుంది. నాగశౌర్య, షామిలీ కాంబినేషన్ స్క్రీన్ పై ఫ్రెస్ ఫీలింగ్ కలిగిస్తుంది.

అమ్మమ్మని ఎట్టి పరిస్థితుల్లో నవ్వుతూ చూడాలని తపించే మనవడిలా నాగశౌర్య ఈ సినిమాలో కనిపించనున్నాడు. రావు రమేష్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఆడియెన్స్ ని ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో రేపటికల్లా తెలిసిపోతుంది.  సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్  చేసిన ఈ సినిమా స్వాజిత్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కింది.