

Tuesday,August 31,2021 - 03:06 by Z_CLU
భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా లక్ష్య. ఎగ్జయిటింగ్ ఎలిమెంట్స్ తో, ఎంటర్‌టైనింగ్ వేలో, ఎంగేజింగ్‌గా స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నారు దర్శకుడు. ఇందులో రెండు వైవిధ్యమైన లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు నాగశౌర్య. రెండింటిమధ్య వేరియేషన్ చూపించడానికి ఆయన కష్టపడ్డ తీరు స్ఫూర్తిదాయకం.
డైరక్టర్ సంతోష్ జాగర్లపూడి సరికొత్త కథను నెరేట్ చేయడంతోనే, నాగశౌర్య అందులో ఉన్న అనుపానులను అర్థం చేసుకోవడానికి కావల్సిన రీతిలో శిక్షణ తీసుకున్నారు. ఇదే ఫోర్స్ తో షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు టీమ్ తమ ఫోకస్‌ని పోస్ట్ ప్రొడక్షన్ వైపు షిఫ్ట్ చేసింది. నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు. నారాయణదాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల మీద తెరకెక్కుతోంది.
కేతిక శర్మ హీరోయిన్‌గా నటించారు. వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు క్రూషియల్ రోల్ ప్లే చేశారు.
త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటిస్తారు. ఆ వెంటనే ప్రమోషనల్ యాక్టివిటీస్‌ని కూడా స్పీడప్ చేస్తారు.
నటీనటులు: నాగశౌర్య, కేతిక శర్మ, జగపతిబాబు, సచిన్ కేడేకర్ తదితరులు
సాంకేతిక నిపుణులు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి
నిర్మాతలు: నారాయణదాస్ కె నారంగ్, పుస్కూరు రామ్‌మోహన్ రావు, శరత్ మరార్
ఛాయాగ్రహణం: రామ్ రెడ్డి
సంగీత దర్శకత్వం: కాల భైరవ
ఎడిటింగ్: జునైద్
పీఆర్వో: వంశీ శేఖర్ , బి.ఎ.రాజు
Thursday,August 24,2023 07:36 by Z_CLU
Tuesday,August 22,2023 12:43 by Z_CLU
Friday,August 18,2023 03:55 by Z_CLU
Friday,August 18,2023 10:06 by Z_CLU