

Sunday,August 01,2021 - 02:04 by Z_CLU
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు నటిస్తున్నారు.
ఈ మూవీ ప్రమోషన్స్ ను ఇటీవల కిక్ స్టార్ట్ చేసి #LAKSHYASFRIDAY హ్యాష్ ట్యాగ్ పేరుతో ప్రతీ శుక్రవారం లక్ష్య మూవీ నుండి ఒక కొత్త అప్డేట్ ఇవ్వనున్నారు.
దీనిలో భాగంగా ఈ శుక్రవారం నాగశౌర్య, కేతిక శర్మలతో కూడిన ఒక స్పెషల్ రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో కేతిక శర్మ నాగశౌర్య నుదిటిపై ముద్దు పెడుతుండడం మనం చూడొచ్చు. ఈ పోస్టర్ సినిమాలో వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండనుందో తెలియజేస్తుంది.
ఈ మూవీ చిత్రీకరణ ముగింపు దశలో ఉంది అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.
తారాగణం: నాగశౌర్య, కేతికశర్మ, జగపతి బాబు,సచిన్ ఖేడేకర్
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ధీరేంధ్ర సంతోష్ జాగర్లపూడి
నిర్మాతలు: నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్
సినిమాటోగ్రాఫర్: రామ్‌రెడ్డి
సంగీతం: కాలబైరవ
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
పిఆర్ఓ: బి.ఎ.రాజు, వంశీ -శేఖర్.
Friday,February 10,2023 12:48 by Z_CLU
Sunday,December 18,2022 08:54 by Z_CLU
Thursday,November 10,2022 03:50 by Z_CLU
Sunday,July 17,2022 10:06 by Z_CLU