Varudu Kaavalenu - 2018లో విన్న కథ ఇది

Sunday,October 24,2021 - 11:36 by Z_CLU

NagaShaurya about Varudu Kaavalenu Movie

వరుడు కావలెను (Varudu Kaavalenu) సినిమాకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటపెట్టాడు హీరో నాగశౌర్య. ఈ కథను మూడేళ్ల కిందటే విన్నాడంట శౌర్య. అప్పట్నుంచి ఈ కథను సెట్స్ పైకి తీసుకువెళ్లడం కోసం వెయిట్ చేశానని, ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే.. 

– 2018లో కథ విన్నాను. వెంటనే ఓకే చేశా. 2019లో షూటింగ్‌ మొదలుపెట్టాం. ఈ జర్నీలో రెండుసార్లు కరోనా మహమ్మారిని చూశాం. చాలా కష్టపడి సినిమా పూర్తి చేసి విడుదల వరకూ వచ్చాం.

– Varudu Kaavalenu -సంగీత్ ఫంక్షన్

– సినిమా అవుట్‌పుట్‌ ఒక రేంజ్‌లో వచ్చింది. ‘మన కుటుంబం మంచిది’ అని ఎంత గర్వంగా చెప్పుకుంటామో.. మా సినిమా బాగా వచ్చిందని అంతే గర్వంగా చెప్పుకొంటాం. ఇది ఓవర్‌ కాన్షిడెన్స్‌ కాదు. సినిమా పట్ల ఉన్న నమ్మకం.

– సినిమా బాగా వచ్చిందని తెలిసి ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. అయినా నిర్మాతలు థియేటర్‌ రిలీజ్‌ కోసమే వేచి చూశారు. సౌజన్య అక్క ఎన్నో సంవత్సరాలుగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తూ ఓ మంచికథ రాసుకుంది. ఈ సినిమాతో దర్శకురాలిగా అవకాశం అందుకుంది. మంచి అవుట్‌పుట్‌ కోసం చాలా పోరాడింది. ఈ సినిమా హిట్‌తో తన కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది.

Varudu Kaavalenu Movie Sangeet function nagashaurya ritu varma pooja hegde

– విశాల్‌ చంద్రశేఖర్‌ అందించిన సంగీతంతో మేం మొదటి సక్సెస్‌ అందుకున్నాం. భూమి పాత్రకు రీతూవర్మ పర్ఫెక్ట్‌గా సూట్‌ అయింది. తనతో మళ్లీమళ్లీ పని చేయాలనుంది. చినబాబుగారు, వంశీలతో జర్నీ చాలా అందంగా ఉంటుంది. కథను, సినిమాను ప్రేమించే నిర్మాతలు వీరు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం. మంచి కథకు ఎక్కడా వెనకాడకుండా బడ్జెట్‌ పెడతారు.

– ఈ నెల 29న విడుదల కానున్న మా చిత్రానికి ఎలాంటి భయం లేకుండా అందరూ రావాలి. థియేటర్ల దగ్గర కొవిడ్‌ నిబంధనలు అన్ని పాటిస్తున్నాం

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics