Nagarjuna's The Ghost - దుబాయ్ లో కింగ్

Tuesday,March 15,2022 - 12:01 by Z_CLU

Nagarjuna’s The Ghost Movie Lengthy Schedule Commences In Dubai

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ల హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ `ది ఘోస్ట్` షూటింగ్ దుబాయ్ లో తిరిగి ప్రారంభమైంది. ఇది లాంగ్ షెడ్యూల్. సినిమాలోని ప్రముఖ తారాగణం పాల్గొనే చాలా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్ లో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించడానికి ఎంపికైన సోనాల్ చౌహాన్ కూడా టీమ్ తో జాయిన్ అయింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లోని కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను కూడా టీమ్ రిలీజ్ చేసింది.

నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు చేస్తున్న సోనాల్ ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ లో భాగం కావడం ఆనందంగా ఉందని ప్రకటించింది. ఈ సినిమాలో నాగార్జున యాక్షన్ మోడ్ లో కనిపించనున్నాడు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ముఖేష్ జి కెమెరా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్, రాబిన్ సుబ్బు, నభా మాస్టర్ స్టంట్ డైరెక్టర్లు.

nagarjuna the ghost movie 4 nagarjuna the ghost movie 4 nagarjuna the ghost movie 4

సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: ప్రవీణ్ సత్తారు
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP మరియు నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.
యాక్షన్: రాబిన్ సుబ్బు మరియు నభా మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics