'రాజు గారి గది 2' తర్వాతే..

Sunday,August 06,2017 - 02:30 by Z_CLU

ప్రెజెంట్ ఓంకార్ డైరెక్షన్ లో ‘రాజు గారి గది 2’ సినిమా చేస్తున్న నాగ్ ఈ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇచ్చి రిలీజ్ కి రెడీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తయ్యి చాలా రోజులే అవుతున్నప్పటికీ నాగ్ మాత్రం తన నెక్స్ట్ సినిమా పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా క్యూరియాసిటీ కలిగిస్తున్నాడు.

ప్రెజెంట్ నాగ్ తనతో పాటు చైతుకి కూడా బిగ్గెస్ట్ హిట్ అందించిన కళ్యాణ్ కృష్ణ తోనే నెక్స్ట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడనే టాక్ వినిపిస్తుంది. అయితే ఇటీవలే నాగ్ కళ్యాణ్ కృష్ణ తో ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ టైటిల్ తో సినిమా చేస్తానని, కానీ దానికి స్క్రిప్ట్ ఇంకా కుదరలేదని, ఆ సినిమా చేస్తే కచ్చితంగా సంక్రాంతి కే రిలీజ్ చేస్తానని చెప్పడంతో నాగ్- కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో సినిమా ఈ ఏడాది ఉండదనే విషయం అర్ధమైంది. అయితే ఇప్పటి వరకూ నాగ్ తన నెక్స్ట్ సినిమాకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వకపోవడంతో అక్కినేని ఫాన్స్ కింగ్ నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్ తో ఉంటుందా… అని క్యూరియాసిటీ తో వెయిట్ చేస్తున్నారు.  ప్రస్తుతం ‘రాజు గారి గది 2’ పై మాత్రమే  ఫోకస్ పెట్టిన నాగ్ ఈ సినిమా రిలీజ్ తరవాతే నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేస్తాడేమో..చూడాలి….