ఊహించని నిర్ణయం తీసుకున్న నాగార్జున

Saturday,September 10,2016 - 04:00 by Z_CLU

కేవలం సినిమాల విషయంలోనే కాదు నిజజీవితంలో కూాాడా నాగార్జున అప్పుడప్పుడు డేర్ డెసిషన్స్ తీసుకుంటాడు. తన మనసుకు నచ్చింది అనిపిస్తే చాలు రిస్క్ అయినా చేసేస్తాడు. తాజాగా ఈ మన్మధుడు మరో నిర్ణయం తీసుకున్నాడు. ఇది మాత్రం ఇప్పటివరకు ఎవరూ ఊహించని నిర్ణయమే. అవును… నాగార్జున త్వరలోనే సింగింగ్ ను ప్రొఫెషన్ గా మార్చుకుంటాడట. ఈ విషయాన్ని స్వయంగా కింగ్ బయటపెట్టడం విశేషం. నిర్మలా కాన్వెంట్ లో నాగార్జున పాడిన కొత్తకొత్త భాష అనే పాట ఇనిస్టెంట్ గా హిట్ అయింది. ఆ పాటలో నాగార్జున వాయిస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో కూడా నాగార్జున పాటలు పాడినప్పటికీ ఇంత రెస్పాన్స్ మాత్రం అప్పుడు రాలేదు. అందుకే ఇకపై భవిష్యత్తులో కూడా పాటలు పాడతానంటున్నాడు నాగ్. అవసరమైతే పాడడం కోసం ప్రత్యేకంగా ట్రయినింగ్ తీసుకుంటానని చెబుతున్నాడు. ఇకపై సినిమాల్లో నటించడం, సినిమాలు నిర్మించడంతో పాటు సినిమాల్లో పాటలు కూడా పాడాలని నాగ్ నిర్ణయించుకున్నాడన్నమాట.