

Thursday,December 23,2021 - 05:10 by Z_CLU
Akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangarraju In Song Shoot
ఇదే విషయాన్ని నాగార్జున ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. చివరి రోజు షూటింగ్.. మరో పెప్పీ మాస్ సాంగ్ రెడీ అవుతోంది.. పండగ లాంటి సినిమా.. బంగార్రాజు త్వరలోనే రాబోతోంది అని ట్వీట్ వేశారు. దీంతో పాటు నాగార్జున ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో చిన్న బంగార్రాజుగా పంచెకట్టులో నాగ చైతన్య మెరిశారు. ఇక కృతి శెట్టి హాట్ లుక్‌లో అదిరిపోయారు.
కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 2022లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా విడుదల చేసిన పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాసివాడి తస్సాదియ్య అనే పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. నాగార్జున, నాగ చైతన్య కలిసి ఇందులు స్టెప్పులు వేయగా.. ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. అందులో నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.
నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ
కథ, దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
నిర్మాత : అక్కినేని నాగార్జున
బ్యానర్స్ : జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
స్క్రీన్ ప్లే : సత్యానంద్
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్ : యువరాజ్
ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి
పీఆర్వో : వంశీ-శేఖర్