Bangarraju ఫస్ట్ సింగిల్ వచ్చేసింది !

Tuesday,November 09,2021 - 11:41 by Z_CLU

Nagarjuna’s ‘Bangarraju’ First Single Laddunda out !

తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు  ‘బంగార్రాజు‘ అనే టైటిల్ తో నాగార్జున సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఎట్రాక్ట్ చేసిన నాగ్ తాజాగా ఫస్ట్ సింగిల్ తో సోషల్ మీడియాలో హంగామా చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు.

ఆల్బంలో పెప్పీ నంబర్ ని ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేశారు. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ‘లడ్డుండా’ అనే సాంగ్ ఇప్పుడు అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. పాట ఆరంభంలో నాగ్ పాడటంతో ఈ సాంగ్ పై రిలీజ్ కి ముందే హైప్ వచ్చింది. ఇప్పుడు ఫుల్ సాంగ్ తో ఆ అంచనాలు అందుకొని  సూపర్ హిట్ సాంగ్ అనిపించుకుంది. అనూప్ ట్యూన్ కి పర్ఫెక్ట్ లిరిక్స్ అందించాడు భాస్కరభట్ల. కొంటెతనంతో ఆయన అందించిన సాహిత్యం సాంగ్ కి హైలైట్ గా నిలిచింది. అలాగే నాగ్ , ధనుంజయ్ , అనూప్ , నూతన మోహన్ ,మోహన , హరిప్రియ సింగింగ్ కూడా సాంగ్ ని ఎలివేట్ చేసింది.

లిరికల్ సాంగ్ లో విజువల్స్ జతకావడంతో సాంగ్ కి అవి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ప్రస్తుతం మైసూర్ లో ఫైనల్ షెడ్యుల్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే రిలీజ్ డేట్ రానుంది.  నాగార్జున , నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. సీనియర్ రైటర్ సత్యానంద్  స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.


Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics