నాగార్జున మన్మధ బాణం

Tuesday,March 21,2017 - 07:06 by Z_CLU

కింగ్ నాగార్జున… టాలీవుడ్ మన్మధుడు ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. రీసెంట్ గా నమో వెంకటేశాయ సినిమాలో అల్టిమేట్ డివోటి గా నటించి మెప్పించిన నాగార్జున, మరోసారి అదే చరిష్మా తో ఎంటర్ టైన్ చేయడానికి ఆల్ సెట్ అయ్యాడు. ప్రస్తుతం పాండిచ్చేరి లో రాజు గారి గది 2 షూటింగ్ లో బిజీబిజీగా ఉన్న నాగార్జున, సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన లేటెస్ట్ ఫోటోస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

ఫస్ట్ టైం హారర్ సినిమా అనగానే నాగార్జున ని డిఫెరెంట్ గా ఎక్స్ పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి తన యంగ్ అండ్ చార్మింగ్ లుక్స్ తో చిన్న సైజు షాకే ఇచ్చాడు నాగార్జున. పాండిచ్చేరిలో తెరకెక్కుతున్న సన్నివేశాల సంగతేమో కానీ, మరింత గ్లామరస్ గా ఎట్రాక్ట్ చేస్తున్న నాగ్, ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ ఎలిమెంట్.

అల్టిమేట్ హారర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున సరికొత్త క్యారెక్టరైజేషన్ తో ఎంటర్ టైన్ చేయనున్నాడు. సమంతా ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.