Nagarjuna Vs Akhil - జేమ్స్ బాండ్ ఎవరు?

Saturday,September 12,2020 - 06:54 by Z_CLU

అక్కినేని అభిమానుల్లో గమ్మత్తైన డిస్కషన్ జరుగుతోంది. రీసెంట్ గా రెండు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అటు నాగార్జున, ఇటు నాగచైతన్య. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే… ఈ రెండు పాత్రలు దాదాపు చాలా దగ్గరగా ఉంటాయనేది ఆ డిస్కషన్.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ ఓ సినిమాకు ఓకే చెప్పాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై ఆ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఇందులో Nagarjuna James bond టైపు పాత్రలో కనిపిస్తాడని టాక్.

సరిగ్గా ఇలాంటి పాత్రతోనే అఖిల్ కూడా ఓ సినిమాకు ఓకే చెప్పాడనే టాక్ నడుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు Akhil. Spy Thriller కాన్సెప్ట్ తో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతోందనేది టాక్.

ఇలా ఒకే కాంపౌండ్ కు చెందిన ఇద్దరు హీరోలు, ఒకే తరహా పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్నమాట.