ఇప్పుడు నాగ్-వెంకీ టైం

Wednesday,January 25,2017 - 09:13 by Z_CLU

2017 స్టార్టింగ్ లో భారీ కలెక్షన్స్ సాధించి టాలీవుడ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నారు మెగా స్టార్ చిరంజీవి -నటసింహం నందమూరి బాలకృష్ణ. చిరు, బాలయ్య ఈ ఇయర్ ను బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఆరంభించి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటగా ఇప్పుడు మరో ఇద్దరు సీనియర్ హీరోలు బాక్సాఫీస్ వద్ద తమ స్టామినా చూపించడానికి రెడీ అవుతున్నారు.

జనవరి లో మెగా స్టార్, నట సింహం తమ ప్రెస్టీజియస్ ‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలతో హంగామా చేయగా ఫిబ్రవరి లో కింగ్, విక్టరీ ‘ఓం నమో వెంకటేశాయ’,’గురు’ సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఫిబ్రవరి 10 న నాగ్ తన పెస్టిజియస్ డివోషనల్ మూవీ ‘ఓం నమో వెంకటేశాయ’ తో థియేటర్స్ లో అడుగుపెడుతుండగా ఫిబ్రవరి ఎండింగ్ లో వెంకీ తన ప్రయోగాత్మక సినిమా ‘గురు’ తో థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇయర్ స్టార్టింగ్ లో చిరు, బాలయ్య కలిసి జనవరి ని భారీ హిట్స్ తో స్టార్ట్ చేయగా ఇప్పుడు నాగ్, వెంకీ కూడా అలంటి హిట్సే అందుకొని సీనియర్స్ గా ఆ వసూళ్లను కంటిన్యూ చేయాలనీ చేస్తున్నారు. మరి ఈ సీనియర్ హీరోలు ఈ సినిమాలతో  బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాలు అందుకుంటారో? చూడాలి…