బాలీవుడ్ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ లో నాగార్జున

Tuesday,July 10,2018 - 02:46 by Z_CLU

బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు నాగార్జున. 2003 లో రిలీజైన LOC కార్గిల్ తరవాత మళ్ళీ బాలీవుడ్ సినిమాలో నటించలేదు నాగ్. అయితే ఇప్పుడు అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడనే న్యూస్, అక్కినేని ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

రణబీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించనున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో బిగ్ బి, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనున్నాడు. అయితే  నాగ్ ఈ సినిమాలో హై ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ లో నాగ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాని కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో నటిస్తున్న నాగార్జున, ఈ రోజు నుండే ముంబై లో ‘బ్రహ్మాస్త్ర’ సెట్స్ పైకి వచ్చినట్టు  తెలుస్తుంది. ఫాంటసీ అడ్వెంచరస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో నాగ్, బాలీవుడ్ లో తన ఇంపాక్ట్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నా, ఈ న్యూస్ అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందా..? జస్ట్ రూమర్ లా మిగిలిపోనుందా..? అనేది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.