`మ‌న్మ‌థుడు 2`.. ఆల్ మోస్ట్ రెడీ

Tuesday,July 16,2019 - 04:35 by Z_CLU

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ హీరో హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ పూర్త‌య్యింది.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్పుడు డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా హీరో నాగార్జున డ‌బ్బింగ్ చెబుతున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 9న ప్ర‌పంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తారు.

ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే అవంతికగా న‌టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ పాత్ర‌కు సంబంధించిన ట‌ీజర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌కు కూడా హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుద‌ల‌, ట్రైల‌ర్ రిలీజ్ డేట్స్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు.

న‌టీన‌టులు: కింగ్ నాగార్జున‌, ర‌కుల్, ల‌క్ష్మి, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్‌, ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ ర‌వీంద్ర‌న్‌
నిర్మాత‌లు: నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌
నిర్మాణ సంస్థ‌లు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 స్టూడియోస్‌
మ్యూజిక్: చైత‌న్య భ‌రద్వాజ్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఎం.సుకుమార్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్‌: ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌
స్క్రీన్‌ప్లే: రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌
ఎడిట‌ర్స్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌, బి.నాగేశ్వ‌ర రెడ్డి
డైలాగ్స్‌: కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌
కాస్ట్యూమ్స్‌: అనిరుధ్ సింగ్‌, దీపికా ల‌ల్వాని.
పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌: సి.వి.రావ్‌
డిజిట‌ల్ మార్కెటింగ్‌: నిహారిక గాజుల‌