Nagarjuna - షూటింగ్ కు రెడీ

Friday,May 28,2021 - 01:58 by Z_CLU

ఇటివలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగర్జున నెక్స్ట్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం వల్ల రెండో షెడ్యుల్ వాయిదా పడింది. అయితే త్వరలోనే ఆ షెడ్యుల్ ని స్టార్ట్ చేసి త్వరగా సినిమాను ఫినిష్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడట నాగార్జున.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన సెట్ రెడీ చేస్తున్నారట. అందులోనే వచ్చే నెల నుండి షూటింగ్ జరపడానికి సిద్దం అవుతున్నారని సమాచారం. కోవిడ్ నిబంధనలతో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూట్ చేయాలని టీం డిసైడ్ అయ్యారట. సో త్వరలోనే ఈ సినిమా రెండో షెడ్యుల్ స్టార్ట్ చేసి వీలైనంత వరకూ షూట్ పూర్తి చేసి బంగార్రాజు సినిమాను మొదలు పెట్టే ఆలోచనలో నాగ్ ఉన్నట్లు తెలుస్తుంది.

Praveen Sattaru

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. నాగ్ , కాజల్ కాంబో లో వస్తున్న మొదటి సినిమా ఇది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’ నిర్మించిన సునీల్ దాస్ నారంగ్ , రామ్మోహన్ రావు , శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే నవంబర్ లేదా డిసెంబర్ లో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.

  •  Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics