గది సిద్దమవుతుందా ?

Friday,November 25,2016 - 04:00 by Z_CLU

ఇటీవలే ‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి సోషియో ఫాంటసీ సినిమాతో గ్రాండ్ హిట్ అందుకున్న నాగ్ ‘రాజు గారి గది’ సిక్వెల్ కు రెడీ అవుతున్నాడని ఇందుకోసం డేట్స్ కూడా కేటాయించారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకూ నాగ్ నుండి ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోవడం తో అసలు నాగ్ ఈ సినిమా చేస్తాడా? అనే ప్రశ్న అందరిలో కలుగుతుంది.

      అయితే ఓంకార్ మాత్రం ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశాడని ఈ సిక్వెల్ కోసం అంతా సెట్ చేసేశాడని అంటున్నారు. పి.వి.పి సినిమాస్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను నవంబర్ 27న పూజ కార్యక్రమాలతో ప్రారంభించి జనవరి నుంచి షూటింగ్ మొదలు పెడతారనే టాక్ వినిపిస్తుంది. మరి ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వం లో ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాలో నటిస్తున్న నాగ్ ‘రాజు గారి గది’ లోకి వెళ్లేదెప్పుడో తెలియాలంటే? తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.