మరో సినిమా ఓకే చేసిన నాగ్?

Monday,June 15,2020 - 05:03 by Z_CLU

ఈ లాక్ డౌన్ టైమ్ లో మరో సినిమాకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మేరకు ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్లు పూర్తయ్యాయి.

మన్మథుడు-2 తర్వాత నాగ్ స్లో అయ్యాడు. ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో వైల్డ్ డాగ్ అనే సినిమా మాత్రమే ఉంది. లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగింది. ఈ గ్యాప్ లో నాగ్ దగ్గరకెళ్లి ఓ మంచి కమర్షియల్ స్టోరీ చెప్పాడట ప్రవీణ్ సత్తారు. లైన్ బాగుందని, స్క్రీన్ ప్లే మొత్తం డెవలప్ చేసిన తర్వాత డిస్కస్ చేద్దామని చెప్పి పంపించాడట నాగ్.

లెక్కప్రకారం రామ్ తో సినిమా చేయాలి ప్రవీణ్ సత్తారు. పూజా కార్యక్రమాలు చేసి మరీ ఆ సినిమా ఆపేశారు. అటు పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా నత్తనడకన సాగుతోంది. ఇలాంటి టైమ్ లో నాగ్ ను ప్రవీణ్ సత్తారు సంప్రదించడం ఆసక్తికరంగా మారింది.