Nagarjuna Praveen Sattaru Movie - ప్రీ-లుక్ రిలీజ్

Saturday,August 28,2021 - 11:02 by Z_CLU

కింగ్ నాగార్జున‌, డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ సత్తారు కాంబినేష‌న్‌లో హై రేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వ‌ర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ చిత్రాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌బోయే చిత్రంగా దీన్ని హై యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇందులో నాగార్జున ప‌వ‌ర్‌పుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

శుక్ర‌వారం నిర్మాత సునీల్ నారంగ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి  ఓ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇందులో నాగార్జున యాక్ష‌న్ ప్యాక్డ్ లుక్‌లో క‌త్తి చేత ప‌ట్టుకుని క‌నిపిస్తున్నారు. అలాగే ఈ సినిమా నుంచి కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు(ఆగ‌స్ట్ 29)న ఎగ్జ‌యిటింగ్ అప్‌డేట్ రానుంది.

యాక్ష‌న్ చిత్రాల‌ను అద్భుతంగా తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఈ సినిమా కోసం అద్భుత‌మైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. నిర్మాత‌లు హై బ‌డ్జెట్‌లో, సూప‌ర్బ్ అనిపించే విజువ‌ల్స్‌తో ఈ సినిమాను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో గుల్ ప‌నాంగ్‌, అనైక సురేంద్ర‌న్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ముకేష్ జి సినిమాటోగ్రాఫ‌ర్‌గా, బ్ర‌హ్మ క‌డలి ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, రాబిన్ సుబ్బు, న‌భా వంటి స్టంట్స్ మాస్ట‌ర్స్‌గా.. టాప్ టెక్నీషియ‌న్స్ ఈ చిత్రం కోసం ప‌నిచేస్తున్నారు.

న‌టీన‌టులు:
నాగార్జున అక్కినేని, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, గుల్ ప‌నాంగ్‌, అనైకా సురేంద్ర‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌వీణ్ స‌త్తారు
నిర్మాత‌లు:  నారాయ‌ణ దాస్ నారంగ్‌, పుస్కూర్ రామ్మోన్‌రావు, శ‌ర‌త్ మ‌రార్‌
బ్యాన‌ర్‌:  శ్రీ వెంక‌టేశ్వ‌ర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్‌
సినిమాటోగ్ర‌ఫీ:  ముఖేశ్.జి
యాక్ష‌న్‌:  రాబిన్ సుబ్బు, న‌భా మాస్ట‌ర్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  బ్ర‌హ్మ క‌డ‌లి
పి.ఆర్‌.ఓ:  వంశీ శేఖ‌ర్‌, బి.ఎ.రాజు

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics