డైరెక్టర్ కన్ఫర్మ్ చేసాడు..నాగ్ నెక్స్ట్ మూవీ అదే !

Saturday,May 19,2018 - 03:00 by Z_CLU

ఇటివలే ఆఫీసర్ సినిమాను ఫినిష్ చేసిన నాగార్జున ప్రస్తుతం నానితో నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా బిజీ అయ్యాడు.. శ్రీరాం ఆదిత్య డైరెక్షన్ లో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూట్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా తర్వాత నాగ్ నటించబోయే నెక్స్ట్ సినిమా ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. లేటెస్ట్ గా నాగ్ నెక్స్ట్ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ.

‘నేల టిక్కెట్టు’ రిలీజ్ అవ్వగానే నాగార్జున గారిని కలవనున్నానని..ఆయన కూడా ‘సోగ్గాడే చిన్ని నాయన’కి  సీక్వెల్ గా తెరకెక్కనున్న  ‘బంగార్రాజు’ సినిమా చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నారని.. తన నెక్స్ట్ సినిమా అదేనని, మోస్ట్లీ జులై నుండి ‘బంగార్రాజు’ సినిమా సెట్స్ పైకి  రావొచ్చని..  క్లారిటీ ఇచ్చేసాడు కళ్యాణ్ కృష్ణ. సో  నాగ్ త్వరలోనే ‘బంగార్రాజు’ గా మారబోతున్నాడన్నమాట.