కొత్త సినిమా కోసం కండలు పెంచుతున్న నాగార్జున

Thursday,November 09,2017 - 01:00 by Z_CLU

కింగ్ నాగార్జున, RGV కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసిన రోజే టాలీవుడ్ లో వైబ్రేషన్స్ బిగిన్ అయ్యాయి. ఈ సినిమాతో మరోసారి ‘శివ’ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని RGV టీమ్ మాత్రమే కాదు, ఫ్యాన్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మూవీ కోసం నాగార్జున ఇప్పటికే మేకోవర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా కోసమే నాగ్ మీసాలు తీసేశాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. దీనికి తోడు ఇప్పుడు కండలు పెంచే పని కూడా పెట్టుకున్నాడట. ఈ సినిమాలో తను పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాననే విషయాన్ని నాగ్ ఇప్పటికే బయటపెట్టాడు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తానని ఎనౌన్స్ చేసిన నాగ్.. ఇప్పుడు ఆ పాత్ర కోసం జిమ్ బాట పట్టాడు. స్లిమ్ గా కనిపించే నాగార్జున, ఈ క్యారెక్టర్ కోసం హెవీ వర్కవుట్స్ చేసి కాస్త దిట్టంగా తయారవుతాడట.

కొత్తగా కనిపించడం నాగార్జునకు కొత్త కాదు. గతంలో ఢమరుకం సినిమా కోసం సిక్స్ ప్యాక్ లో కనిపించి అందర్నీ షాక్ కు గురిచేశాడు. ఇప్పుడు కొత్త సినిమా కోసం మరోసారి కండలు పెంచే పనిలో పడ్డాడు. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో నవంబర్ 20 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.