శైలజారెడ్డి అల్లుడిపై నాగార్జున-నాని కాన్ఫిడెన్స్

Monday,September 10,2018 - 12:54 by Z_CLU

నిన్న గ్రాండ్ గా జరిగింది ‘శైలజారెడ్డి అల్లుడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్. అయితే ఈ ఈవెంట్ కి ‘దేవ, దాస్’ లు అదే నాని, నాగార్జున చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. సినిమా యూనిట్ తో పాటు శైలజా రెడ్డి అల్లుడు సక్సెస్ విషయంలో సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ ఇద్దరు ఈవెంట్ లో చాలా ఎగ్జైటెడ్ గా మాట్లాడారు.

“ఒక స్ట్రాంగ్ విమెన్ ఉన్న, నాన్నగారి సినిమాలన్నీ సూపర్ హిట్లే. ఇప్పుడా వారసత్వాన్ని నాగచైతన్య తీసుకున్నాడు. నాగ చైతన్యని ఈ సినిమాలో చిలిపి చైతన్యలా చూస్తారు. మారుతి సినిమాని చాలా చక్కగా తెరకెక్కించారు…’ అని చెప్పుకున్నాడు నాగార్జున.

“నేను ఈ సినిమా గురించి అడిగినప్పుడు నాగార్జున గారు, ఈ సినిమా ‘అల్లరి అల్లుడు’ లా ఉంటుందని చెప్పారు. ఆ మాట విన్న తరవాత నాకు ఇంకేమీ వినాలనిపించలేదు. మారుతి గారు కాసేపు కూర్చుని తన ఐడియాస్ ని షేర్ చేసుకుంటేనే ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది. అలాంటిది ఆయన ఇన్ని రోజులు ఒకే సినిమాపై ఫోకస్ చేస్తే, సినిమా ఎంత ఎంటర్ టైన్ చేస్తుందో అర్థం చేసుకోగలను…” అని చెప్పుకున్నాడు నాని.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ నాగచైతన్యకి అత్తలా నటించింది. అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్. గోపీసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై  నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.