నాగార్జున నాని కాంబినేషన్ లో సినిమా

Monday,May 15,2017 - 02:10 by Z_CLU

ఊపిరి సినిమాలో కార్తీ కాంబినేషన్ లో నటించిన నాగార్జున ఇప్పుడు న్యాచురల్ స్టార్ ‘నాని’ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. స్టోరీ స్ట్రాంగ్ గా ఉండాలే కానీ ఏ హీరోతో కలిసి నటించడానికైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నాగార్జున, ఇప్పుడు నానితో మరో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

2018 లో లాంచ్ కానున్న ఈ సినిమాకి సంబంధించిన తక్కిన ఇన్ఫర్మేషన్ ఇంకా అఫీషియల్ గా కన్ఫం కాలేదు. ప్రస్తుతానికి ‘రాజు గారి గది 2’ షూటింగ్ తో నాగార్జున, దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న MCA తో నాని బిజీ బిజీగా ఉన్నారు. MCA తరవాత హను రాఘవపూడి సినిమా సెట్స్ పైకి వచ్చే ప్లానింగ్ లో ఉన్నాడు నాని.