నాగార్జున, నాని హీరోలుగా మల్టీస్టారర్?

Monday,September 11,2017 - 11:32 by Z_CLU

శమంతకమణి సినిమాతో మల్టీస్టారర్ మూవీ హ్యాండిల్ చేయడంలో ది బెస్ట్ అనిపించుకున్నాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఇప్పుడీ దర్శకుడు మరో మల్టీస్టారర్ మూవీ చేసే ప్లాన్స్ లో ఉన్నాడు. ఈసారి నాగార్జున, నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్ తెరకెక్కిస్తాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే ఓ అఫీషియల్ స్టేట్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

రాజుగారి గది-2 తర్వాత మరో ప్రాజెక్టు ఎనౌన్స్ చేయలేదు నాగార్జున. నాగచైతన్య-సమంత పెళ్లి పనులు పూర్తయిన తర్వాత తన నెక్ట్స్ మూవీపై ఓ నిర్ణయం తీసుకుంటాడు. అటు నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. వీళ్లిద్దర్నీ హీరోలుగా పెట్టి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సినిమా నిర్మించాలని చూస్తున్నారు నిర్మాత అశ్వనీదత్.

తాజా సమాచారం ప్రకారం ఈ హీరోలకు శ్రీరామ్ ఆదిత్య ఇంకా కథ వినిపించలేదట. కేవలం నిర్మాత అశ్వనీదత్ కు మాత్రమే స్టోరీలైన్ చెప్పారట.