నాగార్జున -నాని మల్టీస్టారర్ పై క్లారిటీ

Wednesday,May 23,2018 - 02:48 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది నాగార్జున – నాని మల్టీస్టారర్ సినిమా. అయితే సినిమా సెట్స్ పై ఉండగానే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విషయంలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా గతంలో వచ్చిన ఏ సినిమాకు రీమేక్ కాదని, కంప్లీట్ గా ఒరిజినల్ స్క్రిప్ట్ అని కన్ఫం చేశాడు.

నాగార్జున, నాని మల్టీస్టారర్ అనగానే న్యాచురల్ గానే ఈ సినిమా చుట్టూ భారీ క్యూరాసిటీ రేజ్ అయి ఉంది. హీరోల  క్యారెక్టర్స్ దగ్గరి నుండి సినిమా స్టోరీలైన్ వరకు సోషల్ మీడియాలో భారీగా డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. అందుకే ఈ సినిమా చుట్టూ క్రియేట్ అవుతున్న స్పెక్యులేషన్స్ కి జస్ట్ 1 ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు.

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 12 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా, నాని సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కంపోజర్.