దేవదాస్ జ్యూక్ బాక్స్ రివ్యూ

Thursday,September 20,2018 - 08:05 by Z_CLU

దేవదాస్ జ్యూక్ బాక్స్ రిలీజయింది. నాగార్జున, నాని ల మల్టీస్టారర్ అనగానే క్రియేట్ అయిన వైబ్స్ ని ఇప్పటికే ఒక్కో సాంగ్ రిలీజ్ చేసి, నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళారు ఫిలిమ్ మేకర్స్. ఈ రోజు గ్రాండ్ గా ఈ సినిమా ఆడియో రిలీజ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్, బ్యాలన్స్ ఉన్న ఒక్క సాంగ్ ని కూడా కలిపేసి జ్యూక్ బాక్స్ రిలీజ్ చేశారు.

వారు వీరు : ఈ ఆల్బమ్ లో ఫస్ట్ రిలీజైన ఈ పాట మణిశర్మ మార్క్ ని ఎలివేట్ చేసింది. నాని -రష్మిక, నాగార్జున ఆకాంక్ష సింగ్ కాంబినేషన్ లో ఈ సాంగ్ ఉండబోతుందని తెలుస్తుంది.  అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య ఈ పాటని పాడారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాశారు.

లక లక లకమీకుర : వినాయక చవితి స్పెషల్ సాంగ్. సినిమాలో  సందర్భం పక్కన పెడితే ఈ పాట మాత్రం పర్ఫెక్ట్ సీజన్ లో రిలీజయింది. వినాయక చవితి సందర్భంగా మాస్ లో ఈ పాట మరింత స్ప్రెడ్ అయింది. అనురాగ్ కులకర్ణి, శ్రీ కృష్ణ సంయుక్తంగా పాడిన ఈ పాటకి రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశాడు.

హే బాబు : కార్తీక్, రమ్య బెహరా కలిసి పాడిన పాట ఇది. నాని – రష్మిక తో పాటు నాగార్జున – ఆకాంక్ష సింగ్  కాంబినేషన్ లో ఈ సాంగ్ ఉండబోతుందనిపిస్తుంది.  రామజోగయ్య శాస్త్రి లిరిక్ రాసిన ఈ పాట, విజువల్ గా ఇంకా  అదిరిపోతుందనే వైబ్స్ కనిపిస్తున్నాయి.

చెట్టు కింద డాక్టర్ : నాని ఇబ్బందులు పడే హిలేరియస్ సిచ్యువేషన్ లో ఉండబోయే సాంగ్ అనిపిస్తుంది. పలకడానికి ఈజీగా ఉండటంతో ఈ సాంగ్ ట్యూన్ తో పాటు లిరిక్స్ కూడా అందరికీ ఈజీగా రీచ్ అయ్యాయి.

ఏమో ఏమో: సినిమాలో సందర్భానుసారంగా ఉండబోయే సాంగ్. లిరికల్ వీడియోలో ఉన్న ఇమేజెస్ ని బట్టి, సినిమాలో పూజని ( రష్మిక మండన్న) ని ఇంట్రడ్యూస్ చేస్తూ నాని పెట్టిన ట్వీట్ ని బట్టి, ఈ సాంగ్ హీరోయిన్ ని చూసి చూడగానే నాని పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండబోతుందని తెలుస్తుంది. స్లో పేజ్ లో సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్, ఇప్పటికే యూత్ కి కనెక్ట్ అయిపోయింది. ఇక విజువల్స్ పైనే అందరి దృష్టి ఉంది.

మనసేదో వెదుకుతూ ఉంది : కథానుసారంగా ఉండబోయే సాంగ్. సిచ్యువేషన్ గెస్ చేయడం కష్టమే కానీ, డెఫ్ఫినేట్ గా లీడ్ రోల్స్ స్ట్రగుల్ పీరియడ్ లో ఉండబోయే సాంగ్ అనిపిస్తుంది. ఈ పాటని యాజిన్ నిజార్, అనురాగ్ కులకర్ణి పాడారు.