దేవదాస్ ఫస్ట్ సింగిల్ – అదుర్స్

Thursday,August 30,2018 - 06:29 by Z_CLU

నాగార్జున, నాని ల ‘దేవదాస్’ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజయింది. ‘వారు.. వీరు… చూస్తూ ఉన్నా’ అంటూ సాగే లిరికల్ వీడియో లో వర్కింగ్ వీడియో తో పాటు, సాంగ్ లోని కొన్ని స్టిల్స్ ని ఎటాచ్ చేయడం తో ఈ వీడియో మరింత కలర్ ఫుల్ గా అనిపిస్తుంది.

అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య కలిసి పాడిన ఈ సాంగ్ కి సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాశారు. లిరిక్స్ ని బట్టి సినిమాలో ఎగ్జాక్ట్ గా ఏ సిచ్యువేషన్ లో ఈ సాంగ్ ఉంటుందో చెప్పడం కష్టం కానీ, ఇంట్రెస్టింగ్ ట్యూన్ తో కంపోజ్ అయిన సాంగ్, నాగార్జున, ఆకాంక్ష సింగ్, నాని, రష్మిక కాంబినేషన్ లో ఉండబోతుందని తెలుస్తుంది.

ఫస్ట్ సింగిల్ రిలీజనగానే ఫ్యాన్స్ లో క్రియేట్ అయి ఉన్న క్యూరియాసిటీ లెవెల్ కి మ్యాచ్ అయ్యేలా ఉంది ఈ పాట. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. అశ్వినిదత్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్. మణిశర్మ  మ్యూజిక్ కంపోజర్.