నాగార్జున‌, నాని దేవ‌దాస్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Tuesday,August 07,2018 - 06:25 by Z_CLU

ఇప్పటికే టైటిల్ ఎనౌన్స్ మెంట్ తో పాటు క్యారెక్టర్స్ పేర్లను కూడా విడుదల చేశారు. ఈరోజు లేటెస్ట్ గా దేవదాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలో నాగ్, నాని లుక్స్ ను రివీల్ చేశారు. లుక్స్ పరంగా పెద్దగా తేడా లేకపోయినా, క్యారక్టర్స్ మాత్రం చాలా కొత్తగా ఉన్నాయనే విషయం ఫస్ట్ లుక్ చూస్తే అర్థమౌతోంది.

సినిమాలో దాస్ పాత్ర పోషిస్తున్న నాని డాక్టర్ గా కనిపిస్తున్నాడు. ఇక దేవ పాత్రలో గన్ పట్టుకొని మాఫియా డాన్ గా నాగార్జున కనిపిస్తున్నాడు. వీళ్లిద్దరి మధ్యలో ఓ మందు బాటిల్ పెట్టారు. ఇలా ఎంతో ఫన్నీగా, మరెంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫస్ట్ లుక్.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మాతగా, శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ లో నాగార్జున‌కు జోడీగా ఆకాంక్ష సింగ్.. నానికి జోడీగా ర‌ష్మిక న‌టిస్తున్నారు. సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.