నాగార్జున - మరో పదేళ్లు వెనక్కి...

Sunday,April 28,2019 - 11:02 by Z_CLU

చాలా రోజుల తరవాత నాగ్ మన్మధుడిలాగా కనిపించనున్నాడు. రీసెంట్ గా నాగార్జున చేసిన సినిమాలు వరసగా దేవదాస్, ఆఫీసర్, రాజుగారి గది 2 సినిమాల్లో నాగార్జున ఇంత గ్లామరస్ గా కనిపించే అవకాశం దొరకలేదు. కానీ చాలా రోజుల తర్వాత మన్మధుడు 2 కోసం, రొమాంటిక్ గా తయారయ్యాడు నాగ్. మన్మధుడు 2 నుండి రిలీజైన స్టిల్స్ చూస్తుంటే నాగార్జున వయసు మరో పదేళ్లు తగ్గిపోయినట్ట నిపిస్తుంది.

అప్పుడెప్పుడో 17 ఏళ్ళ క్రితం రిలీజయింది మన్మధుడు సినిమా. ఇప్పుడు అదే టైటిల్ తో సినిమా అనగానే నాగ్ లుక్స్ విషయంలో కొద్దో గొప్పో డిఫెరెన్స్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేశారంతా. కానీ మన్మధుడు 2 నుండి రీసెంట్ గా రిలీజైన స్టిల్స్ ని చూస్తే, నాగార్జునకి ఏజ్ తో ఎలాంటి సంబంధం లేదని క్లియర్ అయింది.

‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా తర్వాత రకుల్ నాగ చైతన్యకి పర్ఫెక్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ అన్నారంతా. ఇప్పుడు నాగార్జునకి జోడీగా కూడా అంతే మెస్మరైజ్ చేస్తుంది. నాగ్ కి జోడీగా ఏ జెనెరేషన్ హీరోయిన్ ని ఎంచుకున్నా మ్యాచ్ అవ్వడం గ్యారంటీ అనే టాక్ క్రియేట్ అవుతుంది.

ప్రస్తుతం పోర్చుగల్ లో  నాగార్జున, రకుల్ ప్రీత్ కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్. వైబ్స్ చూస్తుంటే ఈ సినిమా కూడా మన్మధుడు రేంజ్ లో సక్సెస్ అవ్వడం గ్యారంటీ అనే సూచనలే కనిపిస్తున్నాయి.