నాగార్జున గారు నా ఫెవరేట్ హీరో !

Sunday,August 04,2019 - 09:02 by Z_CLU

నాగార్జున నటించిన ‘మన్మధుడు 2’ ఆగస్ట్ 9న థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే… సరిగ్గా అదే రోజు అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ‘కథనం’ కూడా థియేటర్స్ లోకి వస్తుంది. అయితే నాగార్జున సినిమాతో  పోటీ అనే వార్తలపై లేటెస్ట్ గా స్పందించింది అనసూయ.

‘కథనం’ ట్రైలర్ లో లాంచ్ లో అనసూయ మాట్లాడుతూ ” ‘నాగార్జున గారు నా ఫెవరేట్ హీరో. ఆయన సినిమా పోస్టర్ (మన్మధుడు 2), నా సినిమా పోస్టర్ ఒకే రిలీజ్ టైమ్ కి  చూస్తాననుకోలేదు. ఇది ఆయనతో పోటీ పడటం కాదు.పైగా రెండు చిత్రాలు వేర్వేరు జానర్స్.

 “డబ్బుతో ముడిపెట్టి పెద్ద సినిమా, చిన్న సినిమా అనడం సరికాదు. ప్రేక్షకులకు నచ్చిందే పెద్ద సినిమా, నచ్చకపోతే అది సినిమానే కాదు. ధనరాజ్ వల్లే ఈ చిత్రంలో నటించాను. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో పాట ఒక్కటే.  రోషన్ చక్కని నేపథ్య సంగీతం అందించాడు. సతీష్ కెమెరా వర్క్ నాలో కాన్ఫిడెన్స్ నింపింది. సినిమా మెప్పిస్తుందనే నమ్మకముంద“ని తెలిపింది.