నాగార్జున ఇంటర్వ్యూ

Wednesday,August 07,2019 - 03:10 by Z_CLU

మన్మథుడు-2 హిలేరియస్ గా ఉంటుందంటున్నాడు కింగ్ నాగ్. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కామెడీ అద్భుతంగా ఉందని గ్యారెంటీ ఇస్తున్నాడు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు కింగ్ మాటల్లోనే..

నా కోసమే వచ్చినట్టుంది
మంచి రొమాంటిక్ కామెడీ సినిమా కోసం చూస్తున్నాను. అదే టైమ్ లో ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ చూశాను. నాకు కరెక్ట్ గా సరిపోతుందని భావించాను. పాపులర్ ఫ్రెంచ్ స్టార్స్ అందులో నటించారు. పెళ్లి కాని మిడిల్ ఏజ్డ్ వ్యక్తి కష్టాల్ని ఫన్నీగా చూపించారు. అవన్నీ నాకు నచ్చాయి. వెంటనే చేయాలని ఫిక్స్ అయిపోయాను.

పోర్చుగల్ బ్యాక్ గ్రౌండ్
సినిమాకు ఓ కొత్త బ్యాక్ డ్రాప్ ఇవ్వడం కోసమే పోర్చుగల్ ను ఎంపిక చేసుకున్నాం. 4 తరాలుగా ఓ ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయిపోతుంది. నాది నాలుగో తరం అన్నమాట. ఒక తల్లి, ముగ్గురు సిస్టర్స్ మధ్య నలిగిపోయే పాత్ర అది. నాలుగు తరాలుగా పోర్చుగీస్ లోనే ఓ తెలుగు కుటుంబం ఉండిపోతే భాష ఎలా ఉంటుందో, సినిమాలో మా తెలుగు
కూడా అలానే ఉంటుంది. ఇంగ్లిష్ పదాలు కూడా తక్కువే. ఎందుకంటే పోర్చుగల్ ఫ్యామిలీ కదా, ఇంగ్లిష్ కూడా రాదన్నమాట. కాస్త కొత్తగా ఉంటుంది.

నాపై నేనే జోక్స్
సాధారణంగా మన తెలుగు సినిమాల్లో పెళ్లి కానీ హీరోలు కనిపిస్తారు. కానీ వయసు పెరిగిపోతున్నా పెళ్లి చేసుకోని పాత్రలు పోషించింది చాలా తక్కువ మంది. పైగా నాకు ఇది సరిపోతుందని భావించాను. సినిమాలో శామ్ పాత్రకు పెళ్లి అంటే ఇష్టంలేదు. కానీ తల్లి, సిస్టర్స్ మాత్రం ఫోర్స్ చేస్తుంటారు. ఆ క్రమంలో వయసుపై జోక్స్ పేలుతాయి. ట్రయిలర్
చూసింది చాలా తక్కువ. సినిమా నిండా నా ఏజ్ పై జోక్స్ పేలుతూనే ఉంటాయి. ఎవరో జోక్స్ వేసేకంటే, నా ఏజ్ పై నేనే జోక్స్ వేసుకుంటే బెటర్ కదా.

ఈ సినిమాకి రాహుల్ కరెక్ట్
రాహుల్ తీసిన చిలసౌ చూశాను. చాలా బాగా తీశాడు. ఆర్టిస్టులతో పెర్ఫార్మెన్స్ చేయించుకోవడం బాగా తెలిసిన వ్యక్తి. ఈ సినిమాలో అలాంటి పెర్ఫార్మెన్స్ లు చాలా ఉన్నాయి. నా తల్లి, ముగ్గురు సిస్టర్స్, వెన్నెల కిషోర్.. ఇలా చాలా పాత్రలున్నాయి. అందుకే రాహుల్ ను తీసుకున్నాం. రాహుల్ చాలా బాగా డైరక్ట్ చేశాడు. సెన్సిబుల్ సన్నివేశాలు, కామెడీ సీన్స్ చాలా బాగా తీశాడు. రీమేక్ అనగానే రాహుల్ ముందు ఒప్పుకోలేదు. ఒరిజినల్ వెర్షన్ చూసిన తర్వాత చేయడానికి ఒప్పుకున్నాడు. ఎన్నో మార్పులు చేసి, 5-6 డ్రాఫ్ట్ ల తర్వాత తుది రూపం ఇచ్చాం. దాదాపు ఏడాది పట్టింది.

సంగీత దర్శకుడి ఎంపిక వెనక..
ఆర్ఎక్స్100 సినిమా చూశాను. అందులో మ్యూజిక్ నాకు బాగా నచ్చింది. వెంటనే చేతన్ భరధ్వాజ్ ను పిలిపించి మెచ్చుకున్నాను. అప్పుడే అవకాశం ఇచ్చాను. అలా మన్మథుడు-2కు అతడు సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాకు మంచి ట్యూన్స్ ఇచ్చాడు. గతంలో దేవిశ్రీప్రసాద్ కు కూడా ఇలానే అవకాశం ఇచ్చాను.

ఆ క్రెడిట్ రాహుల్ దే
సినిమాను అనుకున్న టైమ్ కంటే ఇంకాస్త ముందే పూర్తిచేశాం. ఆ క్రెడిట్ మొత్తం రాహుల్ కే ఇస్తాను. ముందే పోర్చుగల్ వెళ్లి లొకేషన్స్ అన్నీ లాక్ చేశాడు. ప్రీ-ప్రొడక్షన్ పక్కాగా చేసుకున్నాడు. అందుకే షూటింగ్ ఫాస్ట్ గా, సాఫీగా పూర్తయింది. దీనికి తోడు రాహుల్, కెమెరామెన్ సుకుమార్ మధ్య మంచి సింక్ ఉంది. ఎంత కావాలో అంతే తీసుకున్నారు.

యంగ్ టాలెంటే నన్ను స్టార్ ను చేసింది
కొత్త వాళ్లను నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే అలాంటి వ్యక్తులతో పనిచేస్తే నాలో ఓ కొత్తదనం కనిపిస్తుంది. చాలాసార్లు నేను ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ ఎన్నోసార్లు నేను క్లిక్ అయ్యాను. అలాంటి ఎంతోమంది కొత్తవాళ్లతో చేయడం వల్లనే నేను స్టార్ అయ్యానని భావిస్తున్నాను. నా చాలా సినిమాలకు కొత్త వాళ్లే వర్క్ చేశారు. అదే నా సక్సెస్ సీక్రెట్ అనుకుంటా.

మాకు కథలు దొరకడం కష్టంగా మారింది
సీనియర్ హీరోలకు కథలు దొరకడం కష్టంగా మారింది. కష్టపడాలి తప్పదు. వెదకాల్సిందే. న్యూ జనరేషన్ కథలే చేయాలి. అప్పుడే ప్రేక్షకులు చూస్తారు. ఇక బ్రహ్మాస్త్ర విషయానికొస్తే, ఆ పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. సినిమా చాలా బాగుంటుంది. ప్రతి పాత్రకు ఓ వాల్యూ ఉంటుంది. నేను మాత్రం హిందీ పాత్రల కోసం ఎదురుచూడడం లేదు.
మంచి పాత్రలు దొరికితే చేస్తాను. లేకపోతే లేదు. నాకు తెలుగే ఇంపార్టెంట్.

బైలింగ్వల్ నాకు కలిసిరాలేదు
నా అభిప్రాయం ప్రకారం ద్విభాషా చిత్రాలు వర్కవుట్ అవ్వవు. నేను 4 ద్విభాషా చిత్రాలు చేశాను. ఏదీ ఆడలేదు. ప్రతి రాష్ట్రానికి కల్చర్ డిఫరెంట్ గా ఉంటుంది. తమిళ్, తెలుగు, మలయాళం సంస్కృతుల మధ్య చాలా తేడాలుంటాయి. పంచె కట్టడంలోనే చాలా తేడాలు కనిపిస్తాయి. సినిమాలు ఎలా ఆడతాయి. ద్విభాషా చిత్రాలు ఆడవని నాకు నేనుగా నేర్చుకొని తెలుసుకున్నాను. కొందరికి ఇలా కలిసిరావొచ్చు, నా వరకు నాకు ద్విభాషా చిత్రాలు వర్కవుట్ అవ్వలేదు.

ధనుష్ తో సినిమా ఆగిపోయింది
ధనుష్ తో సినిమా అనుకున్నాం. కానీ అది టోటల్ గా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలియదు. వాళ్లు వచ్చారు, కథ చెప్పారు, నా డేట్స్ కూడా తీసుకున్నారు. 35 రోజులు షూటింగ్ కూడా చేశారు. అంతలోనే ఆ సినిమా ఆపేశారు. నేను మాత్రం షూటింగ్ లో పాల్గొనలేదు. ఇక బంగార్రాజు విషయానికొస్తే ఈ సినిమాపై వర్క్ జరుగుతోంది. ఇంతలోనే కల్యాణ్ కృష్ణ అన్నయ్య మరణించాడు. ఆ తర్వాత మళ్లీ కల్యాణ్ ను కదపలేదు. అతడ్ని నేను తొందర పెట్టదలుచుకోలేదు. ప్రస్తుతానికైతే మన్మథుడు-2 రిజల్ట్ కోసం వెయిటింగ్.

అఖిల్ కెరీర్ పై బెంగ లేదు
అఖిల్ కెరీర్ కు వచ్చిన ఇబ్బందేం లేదు. వాడి కెరీర్ పై నాకు బెంగ లేదు. గతంలో నాగచైతన్య విషయంలో కూడా ఇలానే చాలామంది అన్నారు. నాక్కూడా 9 సినిమాల విషయంలో ఇలానే జరిగింది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ టైమ్ వస్తుంది. అప్పటివరకు వెయిట్ చేయాలి.

రకుల్ కు నాకు మధ్య గొడవ
రకుల్ కు నాకు మధ్య బిగినింగ్ లో వివాదాలు వచ్చాయని చాలామంది అన్నారు. ఆ అమ్మాయి చూడ్డానికి బాగాలేదని నేను అన్నానట. రకుల్ ను చూసి నేర్చుకోండి, ఆ అమ్మాయిలా తయారవ్వండని నేను అందరికీ చెబుతుంటాను. హెల్త్, ఫిజిక్ పై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది రకుల్. ఆమె అంత ఆరోగ్యంగా ఉన్న హీరోయిన్ ను నేను చూడలేదు.

వాళ్లిద్దరివీ చిన్న పాత్రలే
సినిమాలో కీర్తిసురేష్, సమంత నటించారు. వాళ్లవి చాలా ముఖ్యమైన పాత్రలు. రోల్స్ చిన్నవే కానీ బాగుంటాయి. అన్నీ అనుకూలిస్తే మన్మథుడు-3 కూడా తీస్తా. ప్రస్తుతానికైతే ప్లాన్స్ లేవు. చూడాలి.

పుట్టినరోజు వాళ్లతోనే
ఈ పుట్టినరోజుకు మాత్రం అభిమానులకు అందుబాటులో ఉండడం లేదు. నా ఫ్యామిలీ, పిల్లలు, కోడలితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ఉంది. ఇంకా ప్లాన్ చేయలేదు.