నాగార్జున ఇంటర్వ్యూ

Thursday,December 21,2017 - 08:34 by Z_CLU

అఖిల్ ‘హలో’ రేపు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా గతవారం రోజులుగా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో సందడి చేయనున్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు నాగార్జున. ఆ చిట్ చాట్ మీకోసం…

మేం చేయాల్సింది చేశాం….

ఈ సినిమాకు పని చేసిన వాళ్ళంతా ప్రేమగా పని చేశారు. అఖిల్ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పని చేశాడు. నాకు మామూలుగానే సినిమా అంటే చాలా ఇష్టం. అందునా అఖిల్ కోసమనగానే మంచి సినిమా చేయాలనే తాపత్రయం.. ఇలా ఈ సినిమా సక్సెస్ కి ఏం చేయాలో మేమది చేసేశాం. రిజల్ట్ రేపు తెలిసిపోతుంది.

 

నా జోక్యం ఏమీ లేదు…

ఈ సినిమా పూర్తిగా విక్రమ్ సినిమా… మహా అయితే స్క్రిప్ట్ కంప్లీట్ అయినంతవరకే నా జోక్యం ఉంటుంది. ఒక్కసారి స్క్రిప్ట్ లాక్ అయిందంటే నేను ఏ మాత్రం జోక్యం చేసుకోను.. పోస్ట్ ప్రొడక్షన్ లో టెక్నీషియన్స్ కి సరిపడ టైమ్ ఇవ్వమని అడుగుతాను తప్ప అంతకుమించి క్రియేటివిటీ విషయంలో నేనసలు ఇన్వాల్వ్ కాను….

మెగాస్టార్ కళ్ళల్లో నీళ్ళు చూశాను….

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేముందు మెగాస్టార్ ని సినిమా చూడమని చెప్పాను. సినిమా నచ్చితేనే రమ్మన్నా… అయన సినిమా చూశాక హ్యాప్పీనెస్ తో ఆయన కళ్ళల్లో నీళ్ళు చూశాను. ఆనడంతో అఖిల్ ని 2 నిమిషాలు హగ్ చేసుకుని అలా ఉండిపోయారు. అప్పుడు నేను రిలాక్స్ అయిపోయాను.

‘మనం’ సినిమా టైం లోనే అడిగాను…

విక్రమ్ తో ‘మనం’ చేసేటప్పుడే అన్నపూర్ణ స్టూడియోస్ కి మీరు ఇంకో సినిమా చేయాలి,  అఖిల్ తో ప్లాన్ చేస్తున్నాను అని చెప్పాను. కానీ అప్పటికే ఆయన సూర్యతో కమిట్ అయి ఉండటం వల్ల చేయలేకపోయారు. ఇప్పుడు ఈ సినిమాతో కుదిరింది…

డ్యాన్స్ లోను కనిపిస్తుంది….  

‘హలో’ అఖిల్ ఏజ్ కి బాడీ లాంగ్వేజ్ కి మ్యాచ్ అయ్యే సినిమా. డైలాగ్స్, యాక్షన్ లోనే కాదు డ్యాన్స్ లో కూడా ఇమోషన్స్ కనిపిస్తుంటాయి. విక్రమ్ కుమార్ అఖిల్ ని మైండ్ లో పెట్టుకునే ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాడు… అవి అంతే చక్కగా వర్కవుట్ అయ్యాయి…

అఖిల్ షాక్ ఇచ్చాడు…

అఖిల్ ఈ సినిమాలో పాట పాడుతున్నాడనే విషయం అసలు నాకు తెలీదు. 3 నెలలు నాకు తెలీకుండా ప్రాక్టీస్ చేసి ఒక రోజు నాకు సడెన్ గా వినిపించాడు, బిగినింగ్ లో అఖిల్ వాయిస్ లా ఉందేంటి…? అనుకున్నా.. ఆ తరవాత అర్థమైంది.. షాక్ అయిపోయా…

అందుకే బాబ్ బ్రౌన్…  

హాలీవ్డు స్టంట్ డైరెక్టర్ బాబ్ బ్రౌన్ … ట్రాన్స్ ఫార్మర్స్, అవేంజర్స్ సిరీస్, టర్మినేటర్ లాంటి సినిమాలకు చేశాడు. అసలు ఆయన మన సినిమాకు చేస్తాడా అనుకున్నాం. ఆయన రీసెంట్ గా ఒక చైనీస్ సినిమాకు, ఆ తరవాత కొరియన్ సినిమాకు చేశాడు. ఈ సినిమాల తరవాత ఆయనకు ఎక్కడో ఒక ఇండియన్ సినిమాకు పని చేయాలనే ఆలోచన కూడా ఉండటం లక్కీగా మనకు కలిసొచ్చింది…

ఏ సినిమా అయినా అంతే…

నేను చేసే ప్రతి సినిమా ఇమోషనల్ గానే చేస్తాను. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా… ప్రతి సినిమా విషయంలో నేను ఇమోషనల్ గానే ఉంటాను…

 

అఖిల్ అమ్మగా తనే కరెక్ట్ అనిపించింది…

రమ్యకృష్ణ ఎలాగైనా ఈ సినిమాలో ఉండాలని నేను ముందే ఫిక్స్ అయ్యా… అద్భుతమైన స్క్రిప్ట్… నీ క్యారెక్టర్ చాలా బావుంటుందని చెప్పి తనని కన్విన్స్ చేశాను.. తన క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎంతలా ఉంటుందో రేపు సినిమా చూస్తే మీకు తెలిసిపోతుంది.

జగపతి బాబు నచ్చేస్తాడు…

జగపతి బాబు ఈ మధ్య విలన్ రోల్స్ ప్లే చేస్తున్నా ఈ సినిమాలో మాత్రం అందరికీ నచ్చేస్తాడు. సినిమాకి పెద్దగా ఎసెట్ తను ఒక రకంగా చెప్పాలంటే…

అంత స్కోప్ ఉంది…

గీతాంజలి, శివ సినిమాల్లో ఎంత ఎంటర్ టైన్ మెంట్ ఉందో ఈ సినిమాలో కూడా అంత ఎంటర్టైన్ మెంట్ ఉంటుంది.  

అఖిల్ నెక్స్ట్ సినిమా…

ఆ విషయం నాకు తెలీదు. నా బ్యానర్ లో రిలీజయ్యే సినిమాలు, నేను నటించిన సినిమాలు తప్ప ఇంకే సినిమాలో నేను ఇన్వాల్వ్ కాను, నాగచైతన్య విషయం లోను అంతే… అఖిల్ విషయంలోనూ అంతే.. ఇది నా సినిమా కాబట్టి నేను పట్టించుకుంటున్నా… తరవాత అఖిల్ ఇష్టం… తన ప్రొడ్యూసర్స్ ఇష్టం… నాకు సంబంధం లేదు…

మాది హెల్దీ ఫ్రెండ్ షిప్

ఈ సినిమా ఇంకా RGV చూడలేదు. రేపు థియేటర్ లో చూసి ఫేస్ బుక్ లో పెడతానన్నాడు. రెగ్యులర్ గా తను ఫేస్ బుక్ లో కూడా పెట్టలేని చాలా విషయాలు నాకు మెసేజెస్ పెడుతుంటాడు. తన గురించి అందరికీ ఎలాంటి అభిప్రాయమున్నా నాకు RGV చాలా మంచి ఫ్రెండ్. మాది హెల్దీ ఫ్రెండ్ షిప్.

నానితో సినిమా…

శ్రీరామ్ ఆదిత్య కథ చెప్పాడు . నాకు నానికి కూడా చాలా నచ్చింది. కామెడీ ఎంటర్ టైనర్. కాకపోతే ఇంకా ఫైనల్ నేరేషన్ జరగాల్సి ఉంది. ఆ తరవాతే డెసిషన్ తీసుకుంటాం.

 

కంప్లీట్ గా ఆలోచించడం మానేశా…

నిన్నటి వరకు చాలా ప్రెజర్ తీసుకున్నాను. కానీ ఇవాళ్టి నుండి కంప్లీట్ గా రిలాక్స్ అయిపోయా.. ఏదో ఒక పని చేసుకుంటూ బిజీగా ఉంటున్నా.. లేకపోతే ఈ సినిమా గురించే ఆలోచనలు వస్తున్నాయి. రేపు రిలీజయ్యాక ఎలాగూ రిజల్ట్ తెలిసిపోతుంది. ఇంకా మనం స్పెషల్ గా చేయాల్సింది ఏమీ లేదు.

తెలుగు వాళ్ళు కంపల్సరీగా చూస్తారు…

మనవాళ్ళు సినిమా బావుండాలి కానీ తెలుగు సినిమా, డబ్బింగ్ సినిమా.. అని తేడా లేకుండా చూసేస్తారు. మనం మోసం చేయకుండా ఖచ్చితంగా ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో సినిమా తీయాలి కానీ, తెలుగు వాళ్ళు సినిమాలు చూస్తారు… హిట్లు ఇస్తారు… హలో అందరికీ నచ్చుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా…