నాగార్జున ఇంటర్వ్యూ

Monday,December 18,2017 - 01:30 by Z_CLU

హలో సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటున్నాడు నిర్మాత నాగార్జున. అఖిల్ ను తనతో పాటు ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో హలో మూవీ అలా ఉంటుందంటున్నాడు.

 

స్టోరీ ముందే చెప్పేశాం

హలో సినిమా స్టోరీ ఏంటనేది ఆల్రెడీ టీజర్, ట్రైలర్స్ తో చెప్పేశాం. ఇక సినిమా విషయానికొస్తే చిన్నప్పుడు తన సోల్ మేట్ తో విడిపోయి 15 ఏళ్ళు తనను కలవడం కోసం ప్రయత్నిస్తే ఒక ఫోన్ ఆధారం దొరుకుతుంది. అనుకోకుండా అది పోవడం, ఆ ఫోన్ కోసం, అందులో ఆ ఫోన్ నంబర్ కోసం హీరో పడే స్ట్రగుల్ ఈ సినిమా.

 

మ్యాజిక్ ఉంటుంది.

విక్రమ్ సినిమాలో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా విక్రమ్ మార్క్ కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో అది కనిపిస్తుంది.

 

గోల్డ్ లైట్ లో తెరకెక్కించాం.

సన్ లైట్ లో మొత్తం షూటింగ్ జరిగింది. మరీ ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయం లైటింగ్ లో షూటింగ్  చేశాం. అది మాట్లాడుకున్నంత ఈజీ కాదు, కానీ డైరెక్టర్, D.O.P. ఇలాగే చేయాలని ఫిక్సయి చేశారు. ఆ గోల్డెన్ లైట్ ఎఫెక్ట్ సినిమాలో అద్భుతంగా వచ్చింది.

అదే విక్రమ్ ఫిలాసఫీ

 అఖిల్ కి విక్రమ్ స్టోరీ చెప్పలేదు. బిగినింగ్ లో లైన్ చెప్పాడు అంతవరకే… ఆ తరవాత రేపు ఏ సీన్స్ షూటింగ్ ఉంటుందో కూడా అఖిల్ కూడా తెలియనిచ్చేవాడు కాదు. ఆర్టిస్ట్ లో అప్పటికప్పుడు వచ్చే స్పాంటేనియస్ రియాక్షన్ ని ప్రిఫర్ చేస్తాడు విక్రమ్. ఒక్క క్లైమాక్స్ సీన్ మాత్రం ఒకరోజు ముందు, డైలాగ్స్ ప్రాక్టీస్ చేసుకోవడం కోసమని చెప్పాడు తప్ప,  సినిమా మొత్తం ఎప్పుడు అఖిల్ తో డిస్కస్ చేయలేదు. నేను విక్రమ్ చూసుకున్నాం అంతే…

 

పార్ కోర్ స్టంట్స్ హైలెట్స్

ఇప్పటివరకు ఇలాంటి స్టంట్స్ తెలుగు సినిమాలో రాలేదు. ఈ సినిమాలో ఎమోషన్స్ తర్వాత హైలెట్ అయ్యేవి యాక్షన్ ఎపిసోడ్సే.

 

రమ్యకృష్ణ ఫెంటాస్టిక్  

రమ్యకృష్ణ ఈ సినిమాలో అఖిల్ కి తల్లిగా కనిపిస్తుంది. చాలా హ్యాపీగా జాయ్ ఫుల్ మదర్ గా అద్భుతంగా నటించింది. రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చే కామెడీ చాలా నీట్ గా హిలేరియస్ గా ఉంటుంది.

 

మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా

చాలా మంది అంటున్నారు మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు అని… అది ఎప్పుడు అవ్వాలని ఉంటుందో అప్పుడు తప్పకుండా అవుతుంది. అదే చేయాలి అనుకుంటే కష్టం కానీ, రైట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు తప్పకుండా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది.

కళ్యాణి అలా ఫిక్సయింది

‘హలో’ హీరోయిన్ అనగానే చాలామందిని చూశాం. విక్రమ్ ప్రియదర్శన్ గారి దగ్గర మూడేళ్లు అసిస్టెంట్ గా చేశాడు. అయినా ఆ పరిచయం వల్ల కళ్యాణి ని తీసుకోలేదు. ఆడిషన్స్ చేశాకే తను సూట్ అవుతుందనిపించి తీసుకున్నాం.

 

కల్యాణి పెద్ద స్టార్ అవుతుంది

కళ్యాణి చాలా హార్డ్ వర్కింగ్. డెబ్యూ హీరోయిన్ కి ఉండాల్సిన అన్ని లక్షణాలున్న అమ్మాయి. చాలా ఫోకస్డ్ గా ఉంటుంది. సెట్స్ లో సినిమా గురించి తప్ప ఇంకో విషయం మాట్లాడదు. సినిమాలో కూడా తనది మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్.

 

P.S. వినోద్ గురించి

ఫ్యూచర్ లో ఎవరైనా నాతో స్టైలిష్, ఇమోషనల్ బ్యూటిఫుల్ సినిమా చేస్తున్నారంటే  ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సినిమాటోగ్రాఫర్ గా P.S. వినోద్ పేరు చెప్తాను. అంత అద్భుతంగా ఉంటుంది తన సినిమాటోగ్రఫీ. తనతో మనం, సోగ్గాడే చిన్న నాయనా, ఊపిరి, ఇప్పుడు ఈ సినిమా.. అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు.

 

అందుకే డిసెంబర్.

ఫ్యాన్స్ అందరు డిసెంబర్ సెంటిమెంట్ అనుకుంటున్నారు. మన్మధుడు నుంచి చూసుకుంటే డిసెంబర్ నెలలో రిలీజైన ప్రతి సినిమా హిట్టే. కాకపోతే ‘హలో’ విషయానికి వస్తే సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలున్నాయని మైండ్ లో పెట్టుకునే ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నాం.

అదే అఖిల్ లో బెస్ట్ క్వాలిటీ

ఏది చేసినా తన లెవెల్ లో బెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ సినిమాలో స్టంట్స్ కోసం 3 నెలలు ట్రైనింగ్ తీసుకుని మరీ చేశాడు. పాడడంలో కూడా ట్రయినింగ్ తీసుకొని మరీ పాడాడు. వాడిలో అది బెస్ట్ క్వాలిటీ.

 

పెర్ ఫెక్ట్ హాలిడే సీజన్ సినిమా

హలో మూవీ చాలా బావుంటుంది.  పర్ఫెక్ట్ హాలీడే సీజన్ మూవీ. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ముందే చెబుతున్నా “వస్తున్నాం.. ఈసారి కూడా హిట్ కొొడుతున్నాం.”