నాగార్జున ఇంటర్వ్యూ

Tuesday,October 03,2017 - 02:06 by Z_CLU

ప్రస్తుతం ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేస్తూ ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న అక్కినేని నాగార్జున త్వరలోనే ‘రాజు గారి గది 2’ లో మెంటలిస్ట్ క్యారెక్టర్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ సినిమా అక్టోబర్ 13న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ముచ్చటించాడు కింగ్ నాగార్జున.. ఆ విశేషాలు నాగ్ మాటల్లోనే.

 

 

లేటుగా చూశా.. రీజన్ అదే.

పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగానే సెప్టెంబర్ 1 వరకూ ఫినిష్ చేసి సినిమా చూద్దామనుకున్నా.. కానీ అనుకున్న టైంకి షూటింగ్ ఫినిష్ చేసినా స్పెషల్ ఎఫెక్ట్స్ వల్ల చూడడానికి లేట్ అయింది. నిన్నే సినిమా చూశాను.. అంటే సెప్టెంబర్ 1 కి ఫస్ట్ కాఫీ చూడాలనుకున్న..కానీ అక్టోబర్ 2 కి చూశాను. నెల లేట్ అయింది. ఫైనల్ అవుట్ ఫుట్ సంతృప్తినిచ్చింది.’రాజు గారి గది-2′ ఖచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది.

 

మనం తర్వాత మళ్ళీ ఇప్పుడే..

ఎలాంటి ఒపీనియన్ లేకుండా క్యాజువల్ సినిమా చూశాను. బాగా నచ్చింది. చూశాక మరీ ఎక్కువగా కనెక్ట్ అయిపోయాననిపించింది. నిజానికి మనం సినిమా చూసిన తర్వాత కలిగిన గుడ్ ఫీలింగ్ మళ్ళీ ఈ సినిమాకే కలిగింది. సినిమా చూశాక కచ్చితంగా ప్రేక్షకులు కూడా ఒక మంచి సినిమా చూశాం అనే భావనతో గుడ్ ఫీల్ తో బయటికి వస్తారు. అందులో డౌట్ లేదు.

ఆత్మతో మాట్లాడుతుంటా

సినిమాలో ఆత్మతో మాట్లాడే రుద్ర అనే మెంటలిస్ట్ క్యారెక్టర్ చేశా.. కథలో కీ రోల్ నాదే.. నాకు ఆత్మకి మధ్య వచ్చే సీన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు మెయిన్ హైలైట్స్ గా నిలుస్తాయి.

 

కొత్త అనుభూతి కలిగింది

ఈ క్యారెక్టర్ చేయడానికి ముందే అసలు మెంటలిస్ట్ లు ఎలా ఉంటారు. వారు ప్రవర్తన ఎలా ఉంటుంది.. అనే విషయం గురించి హైదరాబాద్ లో ఉన్న ఓ మెంటలిస్ట్ ను కలిశాను.. మనం అనుకున్నది అనుకున్నట్టు మన మాటలతోనే పసి గెట్టేస్తారు. అది చాలా డీప్ అబ్సర్వేషన్. అవన్నీ తెలుసుకొన్నాకే ఈ క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ చేయడం ఓ కొత్త అనుభూతి కలిగించింది.

 

అందుకే ఆ కండీషన్ పెట్టా..

సినిమా ఫైనల్ అవుట్ అవుట్ చూశాకే డబ్బింగ్ చెప్తానని కండీషన్ పెట్టాను. దానికి రీజన్ విజువల్ ఎఫెక్ట్స్… ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ చాలా ముఖ్యం. అందుకే విజువల్ ఎఫెక్ట్స్ కూడా అయ్యాకే డబ్బింగ్ చెప్పాను. ఎఫెక్ట్స్ వర్క్ ఏదో చేసేశాం అనిపించుకుంటే సరిపోదు. ఇలాంటి సినిమాలకు లేట్ అయినా క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయాలి.

 

విజువల్ ఎఫెక్ట్స్ అక్కడ చేయించారు

సినిమాలో గ్రాఫిక్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉండడంతో ముంబై లో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేయించారు. ఇక్కడ కూడా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేస్తున్నప్పటికీ మా టీం స్పెషల్ గా ది బెస్ట్ అనిపించుకోవడం కోసం అక్కడికెళ్లి వాళ్ళతో మంచి క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ చేయించారు. రిలీజ్ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు.

 

 

కంప్లీట్ ఫామిలీ ఎంటర్టైనర్

సినిమా హారర్ జోనర్ అయినప్పటికీ ఓంకార్ దీన్ని కంప్లీట్ ఫామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు. కొన్ని భయపడే ఎలిమెంట్స్ తో పాటు ఊహించని రేంజ్ లో ఫన్ ఉంటుంది. వెన్నెల కిశోర్, ప్రవీణ్, షకలక శంకర్, శ్రీనివాస్ రెడ్డి వారి టైమింగ్ తో భలే ఎంటర్టైన్ చేస్తారు. సినిమా చూశాక ఖచ్చితంగా ఒక మంచి అనుభూతి కలుగుతుంది.

 

చాలా మార్పులు చేశాం

మలయాళ ‘ప్రేతం’ సినిమా కథను మాత్రమే తీసుకొని ప్రేక్షకులకు నచ్చేలా మన నేటివిటీ ఉండేలా సినిమాను తీర్చిదిద్దాడు ఓంకార్. ఆ సినిమాతో పోలిస్తే ఇందులో చాలా మార్పులు ఉంటాయి. క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్లే, కొన్ని సీన్లు ఇలా కొన్ని ఎలెమెంట్స్ ఆడ్ చేసి చేసిన సినిమా ఇది.

 

టైటిల్ మాత్రమే సీక్వెల్

‘రాజు గారి గది’ కి ఈ సినిమాకి అస్సలు సంబంధం ఉండదు. కేవలం టైటిల్ మాత్రమే సీక్వెల్.. ఆ సినిమాతో ఈ సినిమాకి ఎలాంటి పోలిక ఉండదు. సినిమా బాగా హిట్ అయి టైటిల్ పాపులర్ అయింది కాబట్టే అదే టైటిల్ పెట్టాం. సినిమా చూస్తే అది తెలిసిపోతుంది.

 

అలా ఎలా ఒప్పుకున్నావ్ అన్నాను.

నటిగా ఏదో కొత్త క్యారెక్టర్ చేయాలనే ఉద్దేశ్యంతో సమంత ఈ సినిమాలో ఆత్మగా నటించింది. ముందు సమంత ఈ క్యారెక్టర్ చేస్తున్నా అని చెప్పగానే అలా ఎలా ఉప్పుకున్నావ్.. నా కోడలు దెయ్యంగా నటించడం ఏంటి..అని అన్నా. ఆ తర్వాత ఈ క్యారెక్టర్ చేయాలనీ ఉందని మనసులో మాట చెప్పింది.

చైతూ చూడనని చెప్పేశాడు

సినిమాలో సమంతను దెయ్యంలా చూడాలంటే నాకే ఎలాగో ఉంది.. ఇక చైతూ పరిస్థితి చెప్పలేను. అందుకే చైతూ ఈ సినిమా చూడనని ముందే చెప్పేశాడు(నవ్వుతూ).

 

 

అవే హైలైట్స్

సినిమా స్టార్టింగ్ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పుతుంది. ముఖ్యంగా నాకు ఆత్మ కి మధ్య వచ్చే సీన్స్, కామెడీ, థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్, 20 నిమిషాల పాటు ఉండే క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు మెయిన్ హైలైట్స్ అని చెప్పొచ్చు.