చైతు కోసం నాగార్జున హోంవర్క్

Sunday,September 11,2016 - 07:00 by Z_CLU

 ప్రస్తుతం అక్కినేని నాగార్జున తన తనయుల పై పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ఓ పక్క వరుస విజయాలు అందుకుంటూ కథానాయకుడిగా దూసుకుపోతూనే చైతు, అఖిల్ పై ప్రత్యేక శ్రద్ద పెడుతున్న నాగ్… ఈ ఇద్దరి సినిమాలను ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో నాగ చైతన్య-కళ్యాణ్ కృష్ణ సినిమా ఒకటి కాగా మరొకటి అఖిల్-విక్రమ్ కుమార్ ల సినిమా. అయితే  అఖిల్ సినిమా కు కాస్త సమయం ఉండడం తో ముందుగా చైతు సినిమా గురించే ఆలోచిస్తున్నాడట కింగ్. తన ను సంక్రాంతి కింగ్ గా నిలబెట్టిన కళ్యాణ్ కృష్ణ… చైతు కి కూడా ఓ గ్రాండ్ హిట్ ఇస్తాడని నమ్ముతున్నాడు. ఇందుకోసం ఈ సినిమాను భారీ ఎత్తున ప్లాన్ చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకు రకుల్ ప్రీత్ తో పాటు లావణ్య త్రిపాఠి ను నాయికలుగా ఎంచుకున్నట్లు టాక్. అంతే కాదు ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇలా పెద్దబ్బాయ్ సినిమాకు సంబంధించి నాగార్జున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.