"హలో" సినిమాలో నాగ్ ఉన్నాడా..?

Thursday,December 07,2017 - 05:33 by Z_CLU

అఖిల్ మొదటి సినిమాలో నాగార్జున కనిపించాడు. మరి అఖిల్ రెండో సినిమా హలోలో కూడా నాగ్ ఉన్నాడా.. ? ఉన్నాడంటూ మొన్నటివరకు పుకార్లు వచ్చాయి. అయితే అలాంటిదేం లేదని నాగ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి తన పాత్ర ఏంటనే విషయంపై మీడియాతో మాట్లాడాడు.

“ఈ చిత్రానికి వాయిస్‌ ఓవర్ మాత్రమే ఇచ్చాను తప్ప నటించలేదు. సినిమా చూసి చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. పర్సనల్‌గా నేను చాలా హ్యాపీగా వున్నాను. ‘మనం’ ఎంటర్‌ప్రైజెస్‌తో నేను, చైతు, అఖిల్‌ ముగ్గురం సినిమాలు చేస్తాం. అందుకే సెంటిమెంట్‌ ప్రకారంగా ‘మనం’ అనేది ఎప్పుడు వుండాలని ఆ బేనర్‌ పెట్టాం.” హలో సినిమాకు సంబంధించి నాగ్ క్లారిఫికేషన్ ఇది.

అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది హలో సినిమా. అయితే కావాలని పెట్టలేదని, సినిమాకు ఏది అవసరమో అంతవరకే ఖర్చుచేశామంటున్నాడు నాగ్. పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ పై కనిపిస్తుందని భరోసా ఇస్తున్నాడు.