చెప్పిన టైమ్ కు వస్తున్నాం - నాగ్

Monday,July 15,2019 - 12:08 by Z_CLU

వరుసగా సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఇందులో భాగంగా నాగార్జున హీరోగా నటిస్తున్న మన్మథుడు-2 కూడా పోస్ట్ పోన్ అయిందంటూ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇలా పుకార్లు ప్రారంభమైన వెంటనే అలా రియాక్ట్ అయ్యాడు నాగ్. పోస్ట్ పోన్ లాంటి ఆలోచనలు లేవని అంటున్నాడు.

రీసెంట్ గా నాగ్ ట్వీట్ చేశాడు. ఇంతకుముందు చెప్పినట్టుగానే తమ సినిమా ఆగస్ట్ 9న థియేటర్లలోకి వచ్చి తీరుతుందని మరోసారి ఎనౌన్స్ చేశాడు. పనిలోపనిగా సినిమాకు సంబంధించి మరో బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశాడు.

ఆగస్ట్ 15న సాహో వస్తోంది. ఈ సినిమాకు సరిగ్గా వారం ముందు మన్మథుడు-2 వస్తోందన్నమాట. సాహోకు పోటీగా రావడం ఇష్టంలేక మన్మథుడు-2ను తప్పించారంటూ గాసిప్స్ వచ్చాయి. వీటిపై నాగ్ క్లారిటీ ఇచ్చాడు.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ హీరోయిన్ గా నటించింది. సమంత, కీర్తిసురేష్ ప్రత్యేక పాత్రలు పోషించారు.